Begin typing your search above and press return to search.
శ్యామ్ సింగ రాయ్ సెన్సార్ కంప్లీట్
By: Tupaki Desk | 19 Dec 2021 8:43 AM GMTనేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. నాని కెరీర్‌లోనే పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న చిత్రమిది. `టాక్సీవాలా` వంటి తొలి చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న రాహుల్ సంక్రీత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయిన పల్లి ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. నాని నటించిన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం విజయంలో నాని ఫుల్ కాన్ఫిడెంట్‌తో వున్నారు. ఎన్ని చిత్రాలు పోటీగా వున్నా క్రిస్మస్ శ్యామ్ సింగ రాయ్ దే అంటూ చాలా ధీమాతో చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. యు/ ఏ సర్టిఫికెట్ లభించింది. రిలీజ్‌కి అంతా సిద్ధం కావడంతో నాని అభిమానులు ఈ సినిమాపై నాని తరహాలోనే ఫుల్ క్లారిటీతో కనిపిస్తుండటం ఇండస్ట్రీ వర్గాల్లలో ఆసక్తికరంగా మారింది. 1970వ దశకం.. ప్రజెంట్ లో సాగే టైమ్ ట్రావెల్ జర్నీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని కొత్త పంథాలో దర్శకుడు తెరకెక్కించారు.
`టాక్సీవాలా` లో ఆత్మల తీరని కోరికలని తెలుసుకోవచ్చనే అంశానికి సైంటిఫిక్ అంశాలని జోడించి కొత్త కథని చెప్పి పలువురిని ఆశ్చర్యానికి గురిచేసిన రాహుల్ సంక్రీత్యన్ `శ్యామ్ సింగ రాయ్` ని కూడా కొత్త తరహా సైంటిఫిక్ అంశాలని జోడించి తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో స్పష్టం చేశారు కూడా. దీంతో సినిమాలోని కోల్ కత ఎపిసోడ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.
ప్రజెంట్ జనరేషన్‌లో సినిమా డైరెక్టర్ కావాలని ప్రయత్నాలు చేసే వాసుకు .. 1970వ కాలంలో కోల్ కతాలో ఓ ప్రెస్‌ని నడుపుతూ దేవ దాసీ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ఫిక్షనల్ క్యారెక్టర్ శ్యామ్ సింగ రాయ్ కున్న సంబంధం ఏంటనే సరికొత్త పాయింట్ తో ఈ మూవీని రూపొందించారు. ఇదే ఈ సినిమాకు యుఎస్‌పీగా తెలుస్తోంది. ఆకారణంగానే నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద ఎన్ని సినిమాలు వున్నా తన సినిమాకు పోటీ కాదని ఈ క్రిస్మస్ శ్యామ్ సింగ రాయ్ దేనని ధీమాగా చెబుతున్నాడని తెలుస్తోంది. మిర నాని చెబుతున్నట్టుగా ఈ క్రిస్మస్ శ్యామ్ సింగ రాయ్ దేనా? అన్నది తెలియాలంటే ఈ 24 వరకు వేచి చూడల్సిందే.