Begin typing your search above and press return to search.

సింగ‌రాయ్.. పుష్ప‌రాజ్ దిల్ ఖుష్!

By:  Tupaki Desk   |   28 Dec 2021 2:30 AM GMT
సింగ‌రాయ్.. పుష్ప‌రాజ్ దిల్ ఖుష్!
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప‌- ది రైజ్` తొలి వారం భారీ వ‌సూళ్ల‌ను సాధించి సక్సెస్ ఫుల్ గా ర‌న్నింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 17న రిలీజ్ అయిన సినిమాకు క్రిస్మ‌స్ వీకెంట్ బాగా క‌లిసొచ్చింది. క్రిస్మ‌స్ కానుక‌గానే నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `శ్యామ్ సింగ‌రాయ్` రిలీజ్ అయినా ఆ ప్ర‌భావం `పుష్ప` పై పెద్ద‌గా ప‌డ‌లేదు. బ‌న్ని .. నాని ఎవ‌రి క్రేజ్ తో వారు మార్కెట్ లో దూసుకుపోతున్నారు. సింగ‌రాయ్ కి పుష్ప కంటే మంచి టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ బ‌న్నీ బ్రాండ్ ఇమేజ్ తో బ్యాలెన్స్ చేస్తున్నాడు. చాలాచోట్ల నాని సినిమా కంటే బ‌న్నీ సినిమాకే ఎక్కువ థియేట‌ర్ల‌ను హోల్డ్ చేసి ఆడిస్తున్నారు. అయితే క్రిస్మ‌స్ వీకెండ్ ని మాత్రం రెండు సినిమాలు ఎన్ క్యాష్ చేసుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యాయి.

`శ్యామ్ సింగ‌రాయ్` రిలీజ్ తో `పుష్ప` వ‌సూళ్లు త‌గ్గుతాయ‌ని ఊహాగానాలొచ్చినా మెజార్టీ థియేట‌ర్స్ `పుష్ప‌`ని ముందంజ‌లో ఉంచుతున్నాయి. శ్యామ్ సింగ‌రాయ్ తొలిరోజు మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. రెండు..మూడు రోజుల పాటు సింగ‌రాయ్ వ‌సూళ్లు ఫ‌స్ట్ డేకి ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉన్నాయి. సినిమా బ్రేక్ ఈవెన్ దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఆదివారం ప‌బ్లిక్ హాలీడే కావ‌డం తో అన్ని షోలు హౌస్ ఫుల్ కలెక్ష‌న్ల‌తో న‌డించింది. ఇక తొలి వారం త‌ర్వాత `పుష్ప` వేగం త‌గ్గిన‌ట్లు అనిపించినా మ‌ళ్లీ సెకెండ్ వీక్ లో పుంజుకుంది. శ‌ని..ఆదివారాలు మంచి క్యుపెన్సీ క‌నిపించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది.

36 కోట్ల‌కు నైజాం హ‌క్కుల్ని దిల్ రాజు విక్ర‌యించ‌గా దాదాపు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు సీడెడ్ లోనూ బ్రేక్ ఈవెన్ కి చేరువ‌లో ఉంది. ఆంధ్రాలో మాత్రం ప‌రిస్థితుల్ని భిన్నంగా ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ కి చాలా దూరంలో ఉంది. టిక్కెట్లు త‌గ్గ‌డం..థియేట‌ర్ల‌ను మూసివేయ‌డం వంటి అంశాలు ఏపీలో వ‌సూళ్ల‌కు అడ్డంకిగా మారింది. హిందీ..త‌మిళం..మ‌ల‌యాళం భాష‌ల్లో పంపిణీ దారులు లాభాల బాట‌లో ఉన్నారు. ఇక అమెరికాలో మంచి వ‌సూళ్ల‌నే సాధించింది. అఖండ త‌ర్వాత పుష్ప‌.. శ్యామ్ సింగ‌రాయ్ చ‌క్క‌ని ఫ‌లితాల‌తో హోప్ ని పెంచాయి. త‌దుప‌రి సంక్రాంతి సినిమాలు దీనిని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ‌తాయ‌ని అంతా ఆశిస్తున్నారు.