Begin typing your search above and press return to search.
'శ్యామ్ సింగ రాయ్' లో 'సిరివెన్నెల' రాసిన చివరి పాట..!
By: Tupaki Desk | 4 Dec 2021 2:57 PM GMTనేచురల్ స్టార్ నాని నటిస్తున్న మాగ్నమ్ ఓపస్ ''శ్యామ్ సింగరాయ్''. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మించారు. క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరందుకున్నాయి.
ఇప్పటి వరకు 'శ్యామ్ సింగ రాయ్' నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో డిసెంబర్ 7న 'సిరివెన్నెల' అనే మూడో పాటని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇది లెజెండరీ లిరిసిస్ట్, దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన చివరి పాట. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియోని రిలీజ్ చేశారు.
'సిరివెన్నెల' పాట చిత్ర బృందానికి తెలుగు సినీ అభిమానులకు ఎంత స్పెషల్ గా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా హీరో నాని మరియు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ వివరించారు. నాని మాట్లాడుతూ.. “సిరివెన్నెల చాలా ప్రత్యేకమైన పాట. ఎందుకంటే ఇది గ్రేటెస్ట్ లెజెండ్ సీతారామశాస్త్రి గారికి లిరిసిస్ట్ గా ఆఖరి పాట. అలాగే ఆయన రాసిన మరో పాట కూడా త్వరలో విడుదల కానుంది. మా 'శ్యామ్ సింగరాయ్' ని సిరివెన్నెల గారికి అంకితం చేస్తున్నాం'' అని అన్నారు.
రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ.. ''నవంబర్ 3వ తేదీ రాత్రి సిరివెన్నెల గారు ఫోన్ చేసి 'ఆరోగ్యం బాగోలేదు. పాట పూర్తి చేయలేను.. ఎవరితోనైనా రాయిద్దాం' అని చెప్పారు. పర్లేదు సార్ అన్నాను. మరుసటి రోజు, ఉదయం ఆయనే కాల్ చేసి నన్ను నిద్ర లేపారు. ఆరోజు దీపావళి. పాట పల్లవి అయిపోయింది.. చెప్తాను రాసుకో అని చాలా ఎగ్జైటింగ్ గా అన్నారు.
''నేను పక్కనే ఉన్న మహాభారతం పుస్తకంలో రాసుకున్నాను. అద్భుతమైన ఆరు లైన్లతో పల్లవి ఇచ్చారు. మొదటి లైన్లో 'సిరివెన్నెల' అని పేరు ఇచ్చారు. ఎందుకు సార్ ఈ పాటకు మీ సంతకం ఇచ్చారు అని నేను అడిగాను. అందుకు ఆయన 'ఇదే నా చివరి పాట కావొచ్చు నాన్నా' అని గట్టిగా నవ్వారు''
''విధి ఏంటంటే ఈ పాటరికార్డ్ చేయబడిన రోజునే ఆయన అంత్యక్రియలు జరిగాయి. పాట చాలా బాగా వచ్చింది. అందుకే 'సిరివెన్నెల' అని పెట్టుకున్నాం. మీరు వెళ్లిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని ఈ ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయడానికి అవకాశం కల్పించినంనుకు టీమ్ తరపున థాంక్యూ సో మచ్. మిస్సింగ్ యూ'' అని రాహుల్ భావోద్వేగానికి గురయ్యారు.
'సిరివెన్నెల' పాటకు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకూర్చగా.. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి ఆలపించారు. 'నెలరాజుని.. ఇలారాణి.. కలిపింది కదా సిరివెన్నెలా..' అంటూ సాగిన ఈ పాట ప్రోమో ఆకట్టుకుంటుంది. పూర్తి పాట వినాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.
కాగా, 'శ్యామ్ సింగరాయ్' చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని రెండు పాత్రల్లో అలరించనున్నారు. ఇందులో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటించారు. రాహుల్ రవీంద్రన్ - మురళీ శర్మ -అభినవ్ గోమటం - జిషు సేన్ గుప్తా - లీలా శాంసన్ - మనీష్ వాద్వా - బరున్ చందా ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
సాను జాన్ వర్గేష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. కృతి మహేష్ మరియు యష్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు. రవివర్మ యాక్షన్ పార్ట్ చూసుకున్నారు.
'శ్యామ్ ససింగ రాయ్' చిత్రాన్ని డిసెంబర్ 24న తెలుగు, తమిళం, కన్నడ మలయాళం వంటి నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల కానుంది.