Begin typing your search above and press return to search.

సాయిప‌ల్ల‌విలో ఆ కోణం ఎంతో స్వీటెస్ట్

By:  Tupaki Desk   |   21 Dec 2021 8:30 AM GMT
సాయిప‌ల్ల‌విలో ఆ కోణం ఎంతో స్వీటెస్ట్
X
నేచురల్ స్టార్ నాని నటించిన `శ్యామ్ సింగరాయ్` డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. రిలీజ్ కి ముందు చిత్రబృందం ప్ర‌చారంలో స్పీడ్ పెంచిన సంగ‌తి తెలిసిందే. నాని- సాయి పల్లవి- కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ ప్ర‌చారంలో బిజీగా ఉన్నారు.

సాయి పల్లవి తనలోని స్వీటెస్ట్ యాంగిల్ ని ప్రెజెంట్ చేసిన తీరు విస్మ‌య‌ప‌రిచింది. చివ‌రి ఇంటర్వ్యూకి నాని పక్కన కూర్చున్న సాయి ప‌ల్ల‌వి త‌న సీట్ నుంచి లేచి మడోన్నా సెబాస్టియన్ కి ఇచ్చింది. అప్పటి వరకు నానికి ఇరువైపులా సాయి పల్లవి- కృతిశెట్టి కూర్చున్నారు. ఛానెల్ టీమ్ నాని పక్కన సాయి పల్లవి ఉండాల‌ని కోరుకుంది. అయితే త‌న స్నేహితురాలు సెబాస్టియ‌న్ కి చివ‌రి ఇంట‌ర్వ్యూ బావుండాల‌ని తాను కోరుకుంది.

నిజానికి సాయిప‌ల్ల‌వి అంత‌టి త్యాగం చేయాల్సిన అవ‌స‌రం లేదు. కానీ త‌న సాటి వారి గురించి ఆలోచించే మాన‌వ‌త్వమే మ‌నిషిని గొప్ప‌గా నిల‌బెడుతుంది. ఒకరికి చేసే సాయం అది ఏదో ఒక రూపంలో తిరిగి త‌న‌నే చేరుతుంద‌ని అంటారు. సాయిప‌ల్ల‌వి ఎంతో డౌన్ టు ఎర్త్ ఉండ‌డ‌మే గాక ఇలాంటి సాయాలెన్నో చేశార‌ని కొలీగ్స్ చెబుతారు. శ్యామ్ సింగరాయ్ టీమ్ దక్షిణాదిలోని నాలుగు భాషలను విడుదల చేస్తోంది. మలయాళ వెర్షన్ ప్రమోషన్స్ కోసం టీమ్ కొచ్చిన్ వెళుతోంది. శ్యామ్ సింగ‌రాయ్ ని అన్ని ద‌క్షిణాది భాష‌ల్లో విడుద‌ల చేస్తూ నాని ప్ర‌చారానికి అత్యంత ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. త‌న కెరీర్ బెస్ట్ సినిమా అవుతుంద‌ని అత‌డు న‌మ్మ‌కంగా చెబుతున్నారు