Begin typing your search above and press return to search.
శ్యామ్ సింగ రాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ లాస్ట్ అలర్ట్
By: Tupaki Desk | 19 Jan 2022 10:45 AM GMTనాని హీరోగా సాయి పల్లవి మరియు కృతి శెట్టి లు హీరోయిన్స్ గా రూపొందిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ రాహుల్ సంకీర్త్యన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు. సినిమా చిత్రీకరణ మొదలు అయినప్పటి నుండి ఈ సినిమా పై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. సినిమా విడుదల విషయంలో గందరగోళం లేకుండా సింపుల్ గా డిసెంబర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేసి కరోనా ను తప్పించుకుని ప్రేక్షకులను అలరించి మంచి వసూళ్లను దక్కించుకుంది. మెజార్టీ ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ వసూళ్లను దక్కించుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం నాని అభిమానులతో పాటు సాయి పల్లవి అభిమానులు మరియు కృతి శెట్టి అభిమానులు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా ను ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేసేందుకు గాను నెట్ ఫ్లిక్స్ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది. భారీ మొత్తానికి నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్న శ్యామ్ సింగ రాయ్ ని ఈ వారంలోనే స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా మరోసారి క్లారిటీ ఇచ్చింది. మరో రెండు రోజుల్లో అంటూ శ్యామ్ సింగ రాయ్ స్ట్రీమింగ్ చివరి అలర్ట్ ను నెట్ ఫ్లిక్స్ ఇచ్చింది. థియేటర్లలో చూడలేని వారు ఈ సినిమా ను ఓటీటీ ద్వారా చూసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈమద్య కాలంలో సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ కు సిద్దం అవుతున్నాయి. గత నెల 24వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ను నాలుగు వారాల తర్వాతే స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యారు.
ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పలు థియేటర్లలో రన్ అవుతుంది. అయినా కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కే మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. పుష్ప సినిమా కేవలం మూడవ వారంలోనే స్ట్రీమింగ్ కు ఇవ్వడం జరిగింది. కనుక శ్యామ్ సింగ రాయ్ నాల్గవ వారంలో స్ట్రీమింగ్ చేయడం తప్పేం లేదు అన్నట్లుగా మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాని ద్వి పాత్రాభినయం చేసిన ఈ సినిమా పూర్వ జన్మల ఇతి వృత్తంతో చేయడం జరిగింది. శ్యామ్ సింగ రాయ్ లో మూడవ హీరోయిన్ గా మడోనా సెబాస్టియన్ నటించిన విషయం తెల్సిందే. నాని కెరీర్ లో ఇది మరో మంచి సినిమా గా నిలిచంది. ఆయన నటన పరంగా మరియు కమర్షియల్ హిట్ పరంగా శ్యామ్ సింగ రాయ్ ఒక నిలిచి పోయే సినిమా గా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.