Begin typing your search above and press return to search.
నాని సినిమా కూడా ఆ జాబితాలో చేరేనా?
By: Tupaki Desk | 27 Dec 2021 2:30 PM GMTనాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. నాని ద్వి పాత్రాభినయం మరియు సాయి పల్లవి యాక్టింగ్ కృతి శెట్టి క్యూట్ నెస్ మడోనా సెబాస్టియన్ అందంతో పాటు సినిమాలో చూపించిన పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో పాటు దర్శకుడు కథను నడిపించిన తీరు ఆకట్టుకునే విధంగా ఉండటం వల్ల సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. మొదటి మూడు రోజుల్లో సినిమా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టినట్లుగా రిపోర్ట్స్ అందుతున్నాయి. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు ఒకానొక సమయంలో మాట్లాడుతూ సినిమాకు 60 కోట్లు ఖర్చు చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ స్థాయిలో నాని ఈ సమయంలో రాబట్ట గలడా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తో ఖచ్చితంగా సినిమా ఆ మొత్తంను రాబట్టడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూఎస్ లో ఈ సినిమా అప్పుడే బ్రేక్ ఈవెన్ కు చేరువ అయ్యిందని తెలుస్తోంది. చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం సినిమా అప్పుడే అయిదు లక్షల డాలర్లను రాబట్టింది. సినిమా కు పెద్ద పోటీ లేకపోవడంతో పాటు వచ్చే వారంలో కూడా భారీ సినిమా లు ఏమీ లేవు. కనుక ఖచ్చితంగా నాని సినిమా ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ ను చేరడం ఖాయం గా ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది అతి తక్కువ ఇండియన్ సినిమా లు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ల వసూళ్లను దక్కించుకున్నాయి. ఇటీవల విడుదల అయిన అఖండ సినిమా నే ఈ ఏడాదికి చివరి మిలియన్ డాలర్ల సినిమా అనుకుంటే ఈజీగా పుష్ప సినిమా కూడా అక్కడ మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది. అంతే కాకుండా ఇప్పుడు నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా భారీ ఎత్తున వసూళ్లను దక్కించుకుంటూ అక్కడ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి 2021 మిలియన్ డాలర్ల చిత్రాల జాబితాలో చోటు దక్కించుకోబోతుంది. వచ్చే ఏడాది లో ఖచ్చితంగా చాలా సినిమా లే మిలియన్ డాలర్లను ఓవర్సీస్ లో రాబట్టడం ఖాయం. కాని ఈ ఏడాది కరోనా భయం ఉన్నా కూడా మిలియన్ డాలర్లను రాబట్టడం అంటే ఖచ్చితంగా పెద్ద విషయంగా ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. అలాంటి అరుదైన ఘనతను నాని సినిమా దక్కించుకోవడం తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.