Begin typing your search above and press return to search.
శ్యామ్ సింగ రాయ్` రన్ టైమ్ లాక్
By: Tupaki Desk | 19 Dec 2021 5:30 PM GMTనేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని వెంకట్ బోయిన పల్లి నిర్మించారు. యంగ్ డైరెక్టర్ రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మూవీ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందింది.
సినిమా రిలీజ్ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రచారాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ ఏ సర్టిఫికెట్ లభించింది. ఫైనల్ గా రన్ టైమ్ ని 2: 37 గంటలకు లాక్ చేశారు. అంతే కాకుండా ఈ సినిమా చూసినప సెన్సార్ సభ్యులు సినిమా పూర్తి కాగానే నటీనటులు పెర్ఫార్మెన్స్ కి ఫిదా సెన్సార్ సభ్యులు మొత్తం లేచి నిలబడి చప్పట్లతో అబినందనల వర్షం కురిపించారట. అంతే కాకుండా క్లైమాక్స్ భావోద్వేగానికి లోనయ్యేలా చేసిందని, కన్నీళ్లు పెట్టించిందని చెప్పడం గమనార్హం.
ఫస్ట్ హాఫ్ అంతా సాఫీగా ఎంటర్‌టైన్ చేస్తూ లవ్ స్టోరీతో సాగిపోగా.. సెకండ్ హాఫ్ శ్యామ్ సింగ రాయ్ పాత్ర చుట్టూ సాగిందని, ఈ పాత్రే సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలిచిందని చెబుతున్నారు. అంతే కాకుండా దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి పాత్ర మరో హైలైట్ గా నిలిచిందని, ఆమెపై టెంపుల్ లో చిత్రీకరించిన డ్యాన్స్ షో .. మిక్కీ జే మేయర్ అందించిన నేపథ్య సంగీతం...సాను జోన్ వర్గీస్ అందించిన ఫొటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేసిన తీరు సినిమాని మరింత ఉన్నతంగా నిలబెట్టాయని, రాహుల్ సంక్రీత్యన్ అందించిన స్క్రిప్ట్, తను ఎంచుకున్న ఎమోషనల్ కంటెంట్ సినిమా రిలీజ్ తరువాత సెస్సేషన్ క్రియేట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సో సెన్సార్ తరువాత బయటికి వచ్చిన టాక్ సూపర్ హిట్ అని తేల్చేసింది. ఈ సినిమా ఏ రేంజ్ కి వెళుతుందన్నది తెలియాలంటే 24న రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.