Begin typing your search above and press return to search.

మోడీ గెల‌వ‌కుంటే ట్విట్ట‌ర్ ఖాతా మూసేస్తాన‌న్న న‌టుడు!

By:  Tupaki Desk   |   23 May 2019 5:24 AM GMT
మోడీ గెల‌వ‌కుంటే ట్విట్ట‌ర్ ఖాతా మూసేస్తాన‌న్న న‌టుడు!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ఒక్కొక్క‌టిగా వెలువ‌డుతూ ఉన్నాయి. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత వెల్ల‌డైన ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే.. కేంద్రంలో మోడీ స‌ర్కారు.. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్‌.. ఒడిశాలో బిజూ ప‌ట్నాయ‌క్ స‌ర్కారు రావ‌టం దాదాపుగా ఖాయ‌మైన‌ట్లే. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌కు మించిన రీతిలో మోడీ గెలుపు ఖాయ‌మ‌న్న దిశ‌గా అధిక్య‌త‌లు వెలువడుతున్నాయి.

ఇదిలా ఉంటే.. సినీ న‌టుడు ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర ట్వీట్ ఒక‌టి చేశారు. మ‌ళ్లీ మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాకుంటే.. తాను ట్విట్ట‌ర్ నుంచి త‌ప్పుకుంటాన‌ని వ్యాఖ్యానించారు. ఇంకెప్ప‌టికి ట్విట్ట‌ర్ ఖాతాను తెర‌వ‌నంటే తెర‌వ‌న‌ని తేల్చి చెప్పారు.

అంతేకాదు.. అయేగా తో మోడీ హీ అంటూ హ్యాష్ ట్యాగ్ జ‌త చేశారు. ఇక్క‌డ గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం ఏమంటే.. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ మ‌ళ్లీ ప‌వ‌ర్లోకి వ‌స్తున్న‌ప్పుడు సిద్ధార్త్ నెగిటివ్ గా కామెంట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ కేవ‌లం అంచ‌నాలు మాత్ర‌మే..అస‌లైన ఫ‌లితాల కోసం వేచి చూడాల‌ని.. ఈలోపు అధికారంలోకి ఏ పార్టీ వ‌చ్చినా క‌లిగే మార్పు ఏమీ ఉండ‌ద‌ని గుర్తించాలి...గంద‌ర‌గోళానికి గురైనా ప్ర‌యోజ‌నం లేద‌ని పేర్కొన్నారు. అంచ‌నాల్ని చూసి మురిసిపోకూడ‌దంటూ చేసిన వ్యాఖ్య‌ల‌కు భిన్నంగా ఫ‌లితాలు వ‌స్తున్న వేళ‌.. తాను చేసిన నెగిటివ్ వ్యాఖ్య‌ల్ని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నంలో కాస్త మెలోడ్రామాను క‌ల‌గ‌లుపుతూ ట్వీట్లు చేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.