Begin typing your search above and press return to search.
ఈ హీరో వయసు టాపిక్ ఫస్ట్ నేనే గుర్తొచ్చానా రా?
By: Tupaki Desk | 17 July 2021 5:01 AM GMTసోషల్ మీడియా ఛమత్కారాలు వింత ప్రకోపాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా సెలబ్రిటీల నుద్ధేశించి నెటిజనుల వెటకారాలు మరీ శ్రుతిమించుతున్న తీరు సర్వత్రా హాట్ టాపిక్ గా మారుతోంది. చాలా మంది సెలబ్రిటీలను ఈ వేదికలపై అవమానించిన ట్రోలర్స్ ఉన్నారు. ఇలాంటి సెగను హీరో సిద్ధార్థ్ చాలా సార్లు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మళ్లీ ఓ ఇద్దరు కొంటె నెటిజనులు అతడిని అటకాయించగా.. ఇరువైపులా వార్ రసవత్తరంగా మారింది.
నెటిజనుల ట్రోల్స్ కి సిద్ధార్థ్ కూడా ఎక్కడా తగ్గకుండా ఒక టీనేజర్ లా చెలరేగి రఫ్ గానే హ్యాండిల్ చేసిన తీరు ఆశ్చర్యపరిచింది. తనని అవమానించిన ట్రోలర్లకు విద్వేషపూరితమైన పద్ధతిలోనే కౌంటర్లు వేయడం చర్చకొచ్చింది. ఇంతకీ నెటిజనులతో సిద్ధార్థ్ ఘర్షణ ఏమై ఉంటుంది? అంటే.. వివరాల్లోకి వెళ్లాలి.
మోడ్రన్ గాళ్స్ అన్న టాపిక్ తెచ్చిన ఒక ట్విట్టర్ యూజర్ సిద్ధార్థ్ ను ట్యాగ్ చేసి 20 ఏళ్లు నిండిన బాలికలు 40 ఏళ్లు నిండిన సిద్ధార్థ్ పై ఎప్పుడూ ఆహా ఓహో అనే ఫీలింగ్ ని కలిగి ఉంటారని వ్యాఖ్యానించాడు. మధ్య వయస్కులైన పురుషులను ఆరాధించే బాలికలు ప్రవర్తన విచిత్రం! అని అతడు అన్నాడు. ఆసక్తికరంగా సిద్ధార్థ్ ఈ వ్యాఖ్యకు బలమైన ప్రతిస్పందనతో కౌంటర్ వేస్తూ చెలరేగారు.
``ఈ హీరో వయసు టాపిక్ లో నీకు ఫస్ట్ నేనే గుర్తొచ్చానా రా? ట్యాగ్ కుడా చేసావ్? సూపర్ రా దరిద్రమ్. ఏక్కడ్నించి వస్తార్రా మీలాంటోళ్లు?`` అని ఘాటైన తెలుగు భాషలో రిప్లయ్ ఇచ్చాడు. ఈ దెబ్బకు అతడు తోక ముడిచాడు. మరొక ట్విట్టర్ యూజర్ తోనూ మరొక ఆసక్తికరమైన సంభాషణలో సిద్ధార్థ్ అదిరే పంచ్ వేశాడు. ఇది మరింత ఆసక్తికరం.
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మీ క్లాస్ మేట్ కాదా? అని సిద్ధార్థ్ ని సదరు నెటిజన్ అలకాయించాడు. దానికి ``ఛా! అతను నా దత్తపుత్రుడు. నేను మోహన్ బాబు గారి క్లాస్ మేట్. దయచేసి వాస్తవాలను సరిగా తెలుసుకోండి`` అని రుసరుసలాడాడు. మొత్తానికి ఎవరు ఎవరిని ఆడుకున్నారు? అన్నది పక్కన పెడితే తనని కామెంట్లు చేసిన వాళ్లను సిద్ధార్థ్ అస్సలు విడిచిపెట్టడని అర్థమైంది. అతడిలోనూ టీనేజర్ ఇంకా మటుమాయం కాలేదు. అదే ఎనర్జీ ఉత్సాహం తనలో ఉన్నాయనడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. ఇంతకీ సిద్ధార్థ్ వయసు ఎంతో గుర్తు లేదు కదూ? జస్ట్ 42. ప్రస్తుతం మహాసముద్రం అనే తెలుగు చిత్రంలో సిద్ధార్థ్ నటిస్తున్నారు. శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2లోనూ సిద్ధార్థ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. కానీ దురదృష్ఠవశాత్తూ వివాదాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. ఇక ఇవేగాక టక్కర్ - సైతాన్ కా బచ్చా అనే చిత్రాల్లోనూ సిద్ధార్థ్ నటిస్తున్నాడు. ఇవన్నీ కరోనా వల్ల ఆలస్యమవుతున్నాయి.