Begin typing your search above and press return to search.

శ్రద్ధా కపూర్ ఎలాంటిదో అతనికి తెలుసంట!

By:  Tupaki Desk   |   12 Sep 2017 3:30 PM GMT
శ్రద్ధా కపూర్ ఎలాంటిదో అతనికి తెలుసంట!
X
ప్రముఖ బాలీవుడ్ నటుడు - తన విభిన్నవిలనిజంతో ఎంతో మంది ప్రేక్షకుల మన్నన పొందిన శక్తి కపూర్ గుర్తున్నాడా అండీ మీకు. ప్రస్తుతం ఈయనగారి కూతురు తండ్రిలా విలన్ వేషాలు వేయకుండా హీరోయిన్ గా నటిస్తూ తన లేలేత అందాలను వాటంగా అభిమానులకు వడ్డిస్తోంది. ఆమె ఎవరో కాదండీ బాలీవుడ్ సోకులాడి శ్రద్ధా కపూర్. తీన్ పట్టి సినిమాలో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి.. ఆషికీ-2తో అందరి హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ బాగ్ మిల్కా బాగ్ ఫేమ్.. పర్హాన్ అక్తర్ తో ఒకే ఇంట్లో కలిసి ఉంటోందని, తనతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని వార్తలు వినిపించాయి. తీసుకురావడానికి తల్లిదండ్రులు వెళ్తే రానని మొరాయించి అల్లరిపాలైంది ఈ భామ.

తాజాగా ఇలాంటి పుకార్లపై స్పందించిన ఈ సుందరి సోదరుడు - ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ కపూర్ తన సోదరి శ్రద్ధాకపూర్‌ ఎలాంటిదో తనకు తెలుసునంటున్నాడు. ఆమెపై వస్తున్న రూమర్లను పట్టించుకోనని తేల్చిచెప్పాడు. తన సోదరి గురించి ఎవరైనా చెబితే నవ్వి ఊరుకుంటాడంట. ఎవరికీ తెలియనన్ని విషయాలు తన సోదరి గురించి తనకు మాత్రమే తెలుసునని చెబుతున్నాడు ఈ సోగ్గాడు. తన సోదరిపై తనకు అధికారం ఉన్నట్లుగా వ్యవహరిస్తానని అదే సమయంలో తామిద్దరం చాలా సన్నిహిత మిత్రుల మాదిరిగా ఉంటూ అన్ని విషయాలు చర్చించుకుంటామని చెబుతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరు హసీనా పార్కర్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సిద్ధాంత్‌ దావూద్‌ ఇబ్రహీంగా నటిస్తుండగా.. శ్రద్ధా అతడి సోదరి హసీనా పాత్రలో మనల్నిఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ముఖ్యంగా ఫర్హాన్‌ అక్తర్‌ తో శ్రద్ధా చాలా చనువుగా ఉంటున్నారని, వారిద్దరి మధ్య సంబంధాలు బయటకు చెప్పలేనంతగా గాఢంగా మారాయని రూమర్లు వినిపిస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తే నవ్వి ఊరుకుంటున్నాడంట. 'మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు ఉండవు. మేం ఎల్లప్పుడు ఒకరికోసం ఒకరం ఉంటాం. నిజమేమిటో కూడా నాకే తెలుసు. అందుకే ఇలాంటి కథలు విన్నప్పుడు నవ్వి ఊరుకుంటా అంటున్నాడు.