Begin typing your search above and press return to search.

మసకలి 2.0 రికార్డ్ డిస్ లైక్స్..స్పందించిన సిద్ధార్థ్!

By:  Tupaki Desk   |   14 April 2020 8:50 AM GMT
మసకలి 2.0 రికార్డ్ డిస్ లైక్స్..స్పందించిన సిద్ధార్థ్!
X
సినిమాల రీమేక్స్ ఎక్కువ శాతం బాగుంటాయి. కారణం ఏంటంటే ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న లోటుపాట్లు సరిచేసి మరీ సినిమాతీస్తారు కాబట్టి బెటర్ గానే ఉంటుంది. అయితే క్లాసిక్ సినిమాల విషయంలో మాత్రం ఈ లాజిక్ వర్తించదు. ఇదే కనుక పాటల రీమిక్స్ విషయానికి వస్తే ఎక్కువశాతం రీమిక్స్ పాటలు ఏడ్చినట్టే ఉంటాయి. ఒరిజినల్ ట్యూన్ మారిస్తే ఒక కష్టం..మార్చకపోతే కాపీ అంటారు.

ఎలా ఉన్నప్పటికీ రీమిక్స్ పాటలు ఎక్కువగా పాపులర్ అవుతాయి. కారణం ఏంటంటే ఈ తరం వారికి ఒరిజినల్ సాంగ్స్ తో పెద్దగా అనుబంధం ఉండకపోవడం. దీంతో ఎక్కువగా ఈ రీమిక్స్ లు ఈ తరం వారికి కనెక్ట్ అవుతాయి. విజయం సాధిస్తాయి. కానీ ఈమధ్యే విడుదలైన మసకలి 2.0 మాత్రం ఎక్కువమందికినచ్చలేదు. పైగా తీవ్ర విమర్శలు మూటకట్టుకుంది. ఈ పాటకు ఒరిజినల్ అభిషేక్ బచ్చన్ - సోనమ్ కపూర్ నటించిన 'ఢిల్లీ 6' సినిమాలోని మసకలి పాట. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్చి రీమిక్స్ చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా.. తారా సుతారియాలు వీడియోలో డ్యాన్స్ చేశారు.

జనాలకు నచ్చకపోవడంతో అదే పనిగా డిస్ లైక్స్ మోతమోగించారు. వారం క్రితం ఈ పాటను రిలీజ్ చేస్తే ఏప్రిల్ 11 నాటికి లైక్స్ కంటే డిస్ లైక్స్ సంఖ్య ఎక్కువగా ఉండడం గమనించాల్సిన అంశం. డిస్ లైక్స్ సంఖ్య 443K కాగా లైక్స్ 402 K మాత్రమే. దీంతో బెంబేలెత్తిపోయిన టీసీరీస్ వారు లైక్స్ డిస్ లైక్స్ ను హైడ్ చేయడం గమనార్హం. ఈ పాటపై వస్తున్న విమర్శలకు స్పందించిన సిద్ధార్థ్ మల్హోత్రా "నా సినిమాను ఎవరైనా రీమేక్ చేస్తే .. అది సరిగా లేకపోతే నేను కూడా అప్సెట్ అవుతాను" అంటూ రీమిక్స్ పాట ఫెయిల్యూర్ ను పరోక్షంగా ఒప్పుకున్నాడు.