Begin typing your search above and press return to search.

13 ఏళ్ళ తర్వాత తెరపైకొస్తున్న ప్రేమ జంట

By:  Tupaki Desk   |   19 April 2019 9:50 AM IST
13 ఏళ్ళ తర్వాత తెరపైకొస్తున్న ప్రేమ జంట
X
గత ఏడాది బాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన అందాదున్ సౌత్ రీమేక్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంశలు అందుకుంది. తాజా అప్ డేట్ ప్రకారం దీన్ని తెలుగు తమిళ్ లో సిద్దార్థ్ హీరోగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

దీనిపట్ల తాను చాలా ఆసక్తిగా ఉన్నానని సిద్దార్థ్ కొద్దిరోజుల క్రితమే ప్రకటించాడు. తనకు జోడిగా త్రిష నటించే ఛాన్స్ ఉన్నట్టు తెలిసింది. హిందీ వెర్షన్ లో రాధికా ఆప్టే చేసిన పాత్రను త్రిష చేస్తుందని కోలీవుడ్ టాక్. 96తో కెరీర్ వేగాన్ని అమాంతం పెంచుకున్న త్రిషకు ఆఫర్ల వెల్లువ బాగానే ఉంది. ఇది ఓకే అయితే 13 ఏళ్ళ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అయినట్టు ఉంటుంది.

2005లో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో సిద్దార్థ్ త్రిషల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రభుదేవా దర్శకత్వంలో ఎంఎస్ రాజు నిర్మించిన ఈ మూవీ వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది. మళ్ళి ఇన్నాళ్లకు సిద్దార్థ్ తో త్రిష జోడి అవుతుందన్న మాట. అందాదున్ రికార్డుల పరంపర ఇంకా ఆగలేదు. చైనాలో ది పియానో ప్లేయర్ గా రిలీజ్ చేస్తే ఏకంగా 200 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది. అందుకే సౌత్ లో కూడా ఇది ఖచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు. ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.