Begin typing your search above and press return to search.
హీరో అంత ఆవేశపడిపోయాడేంటి?
By: Tupaki Desk | 12 Nov 2017 9:48 AM GMTవచ్చే శుక్రవారం ‘గృహం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు సిద్ధార్థ్. ఈ సినిమాకు తమిళంలో.. హిందీలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇండియాలో వచ్చిన బెస్ట్ హార్రర్ థ్రిల్లర్లలో దీన్ని ఒకటిగా చెబుతున్నారు. ఐతే ఇది కేవలం తమిళ సినిమా కాదని అంటున్నాడు సిద్ధు. దీన్ని తెలుగు.. హిందీ భాషల్లో డబ్బింగ్ సినిమాగా చెప్పడాన్ని అతను తప్పుబడుతున్నాడు. మూడు భాషలకు వేర్వేరుగా స్క్రిప్టులు రాసి.. వేర్వేరుగా సన్నివేశాలు తీశామని.. ఇది ప్రాపర్ ట్రై లింగ్వల్ మూవీ అని అంటున్నాడు సిద్ధు. హిందీలో ‘హౌస్ నెక్స్ట్ డోర్’ పేరుతో రిలీజైన ఈ సినిమాను బాలీవుడ్ వాళ్లు సౌత్ సినిమాగా అభివర్ణించడాన్ని అతను తప్పుబట్టాడు.
ఓ వెబ్ పోర్టల్ ‘హౌస్ నెక్స్ట్ డోర్’ సినిమాకు రివ్యూ ఇస్తూ.. దాన్ని ‘సౌత్ సినిమా’ అని పేర్కొందట. దానిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో అతిగా స్పందించాడు సిద్ధు. దీన్ని సౌత్ సినిమా అని చెప్పడం అంటే వివక్షే అని.. ఇది కరెక్ట్ కాదని అతనన్నాడు. ప్రాపర్ హిందీ సినిమాలాగే దీన్ని కూడా తీశామని.. దీన్ని సౌత్ సినిమా అనొద్దని అతను విజ్నప్తి చేశాడు. ఐతే ఈ మాత్రానికే సిద్ధు అంతగా ఆవేశపడిపోవాలా అంటున్నారు జనాలు. ముందుగా ‘అవల్’ పేరుతో నవంబరు 3న తమిళంలో విడుదలైందీ సినిమా. అదే రోజు తెలుగు.. హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయాలనుకున్నాడు సిద్ధు. కానీ అతడి ప్రయత్నాలు ఫలించలేదు. హిందీ వెర్షన్ వారం లేటుగా రిలీజైంది. తెలుగు వెర్షన్ నవంబరు 17కు షెడ్యూల్ అయి ఉంది. మరి ఆ రోజైనా సినిమా అనుకున్న ప్రకారమే రిలీజవుతుందో లేదో చూడాలి.