Begin typing your search above and press return to search.
రాజమౌళి ప్రెస్ మీటే స్ఫూర్తి అంటున్న సిద్ధు
By: Tupaki Desk | 25 Oct 2017 7:10 AM GMTఎస్.ఎస్.రాజమౌళి.. ప్రస్తుతం దేశంలో ఎంతోమందికి ఆదర్శం. అతను దర్శకుడిగా పరిచయమైనప్పటికి.. ఇప్పటికి చూసుకుంటే అసలు పోలికే ఉండదు. కష్టపడి పని చేస్తే శిఖర స్థాయిని అందుకోవచ్చని చూపించిన వ్యక్తి అతను. సామాన్యులకే స్ఫూర్తినిచ్చే అతను ఫిలిం మేకర్స్ కు ఇంకెంత స్ఫూర్తినిస్తాడో చెప్పేదేముంది? రాజమౌళిని చూసి స్ఫూర్తి పొంది ఓ సినిమా చేస్తున్న వాళ్లలో తాను కూడా ఉన్నానంటున్నాడు సిద్దార్థ్. ఒకప్పుడు తెలుగులో హీరోగా మంచి స్థాయిని అందుకున్న సిద్ధు.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఇక్కడ బేస్ కోల్పోయాడు. ఇప్పుడు మళ్లీ ‘గృహం’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ సినిమా విషయంలో తనకు రాజమౌళి ఎలా స్ఫూర్తిగా నిలిచాడో సిద్ధు వెల్లడించాడు.
‘‘కొన్నేళ్ల కిందట రాజమౌళి గారు ఈగ అనే సినిమా మొదలుపెట్టారు. ఆ సినిమా ప్రారంభోత్సవం రోజు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఈ సినిమా కథ మొత్తం చెప్పేశారు. అది చూసి షాకైన వాళ్లలో నేను కూడా ఒకడిని. అలా ముందే కథ చెప్పాలంటే ఎంత గట్స్ ఉండాలి? అలా చెప్పి కూడా ప్రేక్షకుల్ని మెప్పించడం గొప్ప విషయం. ‘గృహం’ విషయంలో మేం కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాం. ఈ సినిమా కథేంటో ట్రైలర్లోనే చెప్పేశాం. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కింద ఉన్న కామెంట్లలో ఒకటి అలాగే ఉంది. మొత్తం కథ ఇప్పుడే చెప్పేసి మీరేం సినిమా చూపిస్తారు అని. ఐతే రెండున్నర నిమిషాల ట్రైలర్ కథను చూపించడానికి మేం నాలుగేళ్లకు పైగా కష్టపడి స్క్రిప్టు రాసుకుని సినిమా చేయలేదు. ఇందులో అంతకుమించిన విశేషాలు చాలా ఉన్నాయి. ఒక డాక్టర్.. అతడి భార్య హిల్ స్టేషన్లో సంతోషంగా ఉంటారు. వాళ్ల పక్కింటికి ఓ కుటుంబం వస్తుంది. అందులో జెన్నీ అనే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి పెద్ద సమస్య ఎదురువుతుంది. ఆమె వల్ల ఈ డాక్టర్ కుటుంబానికి కూడా ఇబ్బందులు వస్తాయి. ఆ సమస్య ఏంటి? దానికి పరిష్కారమేంటి అన్నది ఈ కథ. నేను రాజమౌళి గారి లాగే ముందే కథ చెప్పేస్తున్నా. ఈ కథ వినే సినిమాకు రండి. మేం ఏం చూపిస్తామో చూడండి’’ అని సిద్దార్థ్ అన్నాడు.