Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో వర్కవుట్ అవుతుందనే!!

By:  Tupaki Desk   |   18 Nov 2015 10:30 PM GMT


మూవీ మేకింగ్ లో ఒక్కోళ్లదీ ఒక్కో స్టయిల్ ఉంటుంది. అలాగే కేరక్టర్స్ విషయంలో కూడా. కానీ కొంతమంది మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తుంటారు. క్రియేటివిటీతో కొడుతుంటారు. హీరో సిద్ధార్ధ్ కూడా ఇలాంటి రకమే. ఎప్పుడూ ఒకటే అంటే బోర్ అంటూ.. ఏదైనా కొత్తగా చూపించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అలాంటోడు ఇప్పుడో సినిమా తీసేస్తే ఎలా ఉంటుంది.

జిల్.. జంగ్.. జక్.. లా ఉంటుంది. పేరులోనే కాదు.. అన్ని విషయాల్లోనూ ఈ మూవీ విభిన్నంగానే కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ లో గెటప్స్ తో కొత్తదనం పరిచయం చేసిన సిద్ధూ.. తర్వాత షూట్ ద కురువీ అంటూ ఓ పాటను రిలీజ్ చేశాడు. దీనికి భాషాబేధాలు లేకండా.. అన్ని రకాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ఉత్సాహంతోనే ఇపుడు డింగర డాంగ్.. డింగరడాంగ్ అంటూ సాగే మరో పాటను విడుదల చేశారు. ఇది కురువీ సాంగ్ కంటే కొత్తగా ఉంది. మూవీలో కొన్ని సాంగ్స్, ఫోటోస్ తో రూపొందించడంతో.. చూడ్డానికి కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది.

లిరిక్ విషయంలోనూ ప్రాసలతోపాటు వెరైటీలు ట్రై చేసినట్లుగా అనిపిస్తోంది. మూవీపై ఇంట్రెస్ట్ పెంచడంలో బాగానే సక్సెస్ అవుతున్నాడు సిద్ధూ. అన్నీ బాగానే ఉన్నాయ్ కానీ... క్రియేటివిటీ పాళ్లు కాస్త ఎక్కువయినట్లుగా అనిపిస్తోంది. మరీ ఇంతలా కొత్తదనం అంటే.. కోలీవుడ్ లో బాగానే వర్కవుట్ అవుతుంది. కానీ ఒక్కోసారీ తేడా కొట్టేస్తుంటుంది. ఆ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఎంత నువ్వే ప్రొడ్యూసర్ అయితే మాత్రం.. నీ స్టయిల్ ఆఫ్ క్రియేటివిటీ మొత్తం మూవీ పెట్టేస్తానంటే ఎలా సిద్ధూ.?