Begin typing your search above and press return to search.
ఎంత ఘాటు ప్రేమయో.. పర్ఫెక్ట్ కపుల్ కి పక్కా ఎగ్జాంపుల్
By: Tupaki Desk | 12 Aug 2021 1:30 AM GMTబాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వాణీ ప్రేమాయణం ఇటీవల గూగుల్ లో ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం సాగిస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. చాలా కాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్నా బయటికి ఓపెనవ్వడం లేదు. ఆ జంట విదేశీ ప్రయాణాలు..సన్నిహితంగా కలిసి ఉన్న వీడియోలు ఇప్పటికే చాలానే బయటకు వచ్చాయి. కానీ మీడియా కు మాత్రం ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనంటూ చెప్పి తప్పించుకుంటారు. ప్రస్తుతం ఈ జంట `షేర్షా` సినిమా ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రచారం కోసం ముంబై లో టీవీచానెళ్లు మొత్తం చుట్టేస్తున్నారు. పనిలో పనిగా ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తూ మీడియాలో హైలైట్ అవుతున్నారు.
తాజాగా ఇద్దరు సినిమా ప్రచారంలోనే ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కవర్ ఫోటోకి ఫోజులిచ్చారు. ఫిలింఫేర్ ఆగస్టు నెల ఎడిషన్ కోసం ఇలా కవర్ పేజీపై తళుక్కున మెరిసారు. ప్రేమికులిద్దరు కలిసి మ్యాగజైన్ కోసం ఫోజులివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఈ ఫోటో షూట్ ప్రత్యేకతను సంతరించుకుంది. పింక్ అండ్ వైట్ డిజైనర్ వస్త్రధారణలో కియారా అద్భుతంగా కనిపించింది. సిద్దార్థ్ గోధుమ వర్ణం డ్రెస్ ధరించారు. ఈ లుక్ లో సిద్ధార్థ్ డాషింగ్ గా కనిపిస్తున్నాడు. కొన్ని షాట్లలో ఘాడంగా హత్తుకుని రియల్ ప్రేమికులనే తలపిస్తున్నారు. ఆ ఇద్దరి నడుమా కెమిస్ట్రీ ఎక్కడా మిస్ ఫైర్ కాలేదనడానికి ఈ ఫోటోషూట్ సాక్ష్యం అంటూ కితాబిచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కవర్ ఫోటోలు సోషల్ మీడియా మొత్తం చుట్టేస్తున్నాయి.
బాలీవుడ్ ప్రేమికులు కవర్ పేజీలపై ఫోజులివ్వడం పాతదే. కానీ చాలామంది అధికారికంగా లవర్స్ అని చెప్పి మరీ కవర్ పేజీలకు ఎక్కారు. కానీ ఈ జంట వాళ్లకి భిన్నం. ఇద్దరం మంచి స్నేహితులం అంటూనే మీడియా అటెన్షన్ ని డ్రా చేస్తున్నారు. ఇక ఈ జంట నటించిన `షేర్షా` మూవీ ఆగస్టు 12న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇది బయోగ్రాఫికల్ వార్ సినిమా. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.