Begin typing your search above and press return to search.
క్లారిటీ ఇచ్చినా.. సిద్దూకి తప్పట్లే
By: Tupaki Desk | 23 Oct 2015 5:30 PM GMTపాపం మన హీరో సిద్దార్ధ్.. మనోడు హీరోయిన్ సమంతతో బ్రేకప్ అయినప్పటి నుండీ.. చాలా విమర్శులు ఎదుర్కొంటున్నాడు. దానికి తోడు సినిమాలపరంగా ఒక్క హిట్టు కూడా లేకపోవడం.. అలాగే తెలుగు అస్సలు సినిమాలే చేయకపోవడం.. ఇవన్నీ చాలా నెగెటివిటీని స్ర్పెడ్ చేస్తున్నాయి. అంతేకాకుండా.. ఇప్పుడు మనోడి ట్వీట్ల గురించి కూడా గోల జరుగుతోంది.
నిజానికి బ్రేకప్ అయ్యాక కూడా.. మనోడు చేసిన ఓ రెండు సినిమాలు చూసి సమంత చాలా గర్వంగా ఫీలయ్యింది. వెంటనే ఆ విషయాన్ని ట్విట్టర్ లో పేర్కొంది. కాని సిద్దూ మాత్రం.. అప్పటి నుండి అసలు సమంత సినిమాలనే చూడటం మానేశాడు. ఒకవేళ చూసినా.. బయట మాత్రం చెప్పట్లేదు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే.. బాహుబలి - తని ఒరువన్ - నానుం రౌడీ దాన్ వంటి సినిమాల గురించి తెగ పొగిడేశాడు. మరి మొన్ననే రిలీజ్ అయిన 10 ఎన్రాదుకుళ పరిస్థితి ఏంటి? ఆ సినిమా ఫేట్ ఎలా ఉన్నా కూడా.. అందులో సమంత చాలా బాగా చేసిందని టాక్ ఉంది.. కనీసం ఆ యాస్పెక్టయినా మనోడు పొగడలేదే అంటూ సమంత అభిమానులు ఇప్పుడు అవాకులూ చివాకులూ పేలుస్తున్నారు.
అయితే.. తాను కేవలం ధియేటర్లలో చూసి తనకు ఎంతో నచ్చిన సినిమాల గురించే ట్వీట్లు వేస్తాను కాని.. అలా అన్ని సినిమాల గురించి మాట్లాడబోను అంటూ సిద్దూ ఎంత చెప్పినా కూడా.. ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా.. మనోడ్ని మాత్రం అందరూ ఆడేసుకుంటున్నారు.