Begin typing your search above and press return to search.

లవ్వులో లేనందుకే లక్కీ అంటున్న హీరో

By:  Tupaki Desk   |   22 Jan 2016 6:01 AM GMT
లవ్వులో లేనందుకే లక్కీ అంటున్న హీరో
X
లవర్ బోయ్ పాత్రల్లో ఎంత బాగుంటాడో అనిపిస్తాడు హీరో సిద్ధార్ధ్. ఇతగాడికి రియల్ లైఫ్ లో మాత్రం లవ్వు పెద్దగా కలిసి రాలేదు. స్టార్ హీరోయిన్లతోనే వ్యవహారాలు నడిపినా అన్నీ లవ్ ఫెయిల్యూర్స్ గానే నిలిచాయి. ఇప్పుడు మాత్రం బుద్ధిగా సినిమాలు చేసుకుంటూ గడిపేస్తున్నాడు.

ప్రస్తుతం జిల్ జంగ్ జక్ అంటూ సినిమా చేశాడు సిద్ధార్ధ్. అసలు హీరోయిన్ కూడా లేకుండానే సినిమా తీసేశాడు. ఈ స్టోరీకి హీరోయిన్ అవసరం లేదని అందుకనే ఇలా తీయాల్సి వచ్చిందని చెబుతున్నాడు. డైరెక్టర్ పై ఒత్తిడి తేవడం ఇష్టంలేకే హీరియిన్ ను పెట్టలేదట. అయితే, పాటల విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాలేదని, విభిన్నంగా ఉండేలా కొన్ని పాటలను తనే పెట్టించానని అంటున్నాడు సిద్ధార్ధ్. ఇక తొలిసారిగా చేస్తున్న అరణ్మణై2లో హారర్ కామెడీ జోనర్ లో చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత త్రిష - హన్సికలతో చేయడం హ్యాపీగా ఉందన్నాడు ఈ హీరో.

మరి నీ పెళ్లి సంగతేంటి బాబు అంటే.. దానిపై ఎవరూ ఒత్తిడి తీసుకు రాలేరని, అయినా పెళ్లంటే ఎవరి ఒత్తిడితోనో చేసుకునేది కాదని సిద్ధార్ధ్ అంటున్నాడు. అయితే తానేమీ పెళ్లికి వ్యతిరేకం కాదన్న సిద్ధార్ధ్.. ఇప్పుడేమన్నా లవ్ ఎఫైర్స్ ఉన్నాయా అంటే.. ఇప్పుడు ఎవరితోనూ లవ్ లేనందుకే తాను చాలా లక్కీ అనడం విశేషం. చూస్తుంటే.. ప్రేమ విషయంలో గట్టి పంచ్ లే పడ్డట్టున్నాయి. అందుకే చాలా ఎలర్ట్ గా ఉంటున్నట్లు అనిపిస్తోంది కదూ.