Begin typing your search above and press return to search.
సుశాంత్ : ద్వంసం అయిన ఆ 8 హార్డ్ డిస్క్ ల్లో ఏముంది?
By: Tupaki Desk | 27 Aug 2020 2:30 PM GMTసుశాంత్ కేసును పోలీసుల నుండి సీబీఐ టేకోవర్ చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో సీబీఐ చాలా లోతుగా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత ఆరు రోజులుగా సుశాంత్ స్నేహితుడు అయిన సిద్దార్థ్ పితానీని సీబీఐ వారు విచారిస్తున్నారు. అనేక విషయాలను ఆయన నుండి రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా సుశాంత్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు జరిగిన పరిణామాలు సంఘటనలను ఆయన సీబీఐ వారికి ఆయన పూసగుచ్చినట్లుగా వెళ్లడి చేశాడట.
లాక్ డౌన్ టైం మొత్తం కూడా సుశాంత్ రియాలు కలిసే ఉన్నారు. ఆమె సుశాంత్ ఇంటి నుండి జూన్ 8వ తారీకున వెళ్లి పోయింది. ఆ రోజున 8 హార్డ్ డిస్క్ లను ద్వంసం చేశారు. అది కూడా ఒక ఐటీ నిపుణుడి సమక్షంలో జరిగినట్లుగా ఆయన చెబుతున్నాడు. 8 హార్డ్ డిస్క్‌లను ద్వంసం చేశారు. ఆ సమయంలో వంట మనిషి నేను మేనేజర్ దీపేష్ ఉన్నాడు. ఎవరికి కూడా అందులో ఏం ఉంది అనేది తెలియదు. రియా మరియు సుశాంత్ లకు మాత్రమే ఆ విషయం తెలిసి ఉంటుందని సిద్దార్థ్ పేర్కొన్నాడు.
సుశాంత్ ఇంట్లో ద్వంసం అయిన ఆ హార్డ్ డిస్క్ ల్లో ఏం ఉండి ఉంటుంది.. రియా వాటిని ఎందుకు ద్వంసం చేయించి ఉంటుంది అనే ప్రశ్న ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ విషయంలో రియాను ప్రశ్నిస్తే ఎక్కువ సమాచారం దక్కే అవకాశం ఉందంటున్నారు. రియా చక్రవర్తి ఈ కేసులో కీలకంగా మారడంతో సీబీఐ వారు ఆమెను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. రియాతో గొడవ పడ్డ తర్వాత సుశాంత్ మృతి చెందాడు. కనుక ఏదో తేడా కొడుతుందని నెటిజన్స్ అంటున్నారు. త్వరలో సీబీఐ వారు ఈ కేసును ఒక కొలిక్కి తీసుకు వస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.