Begin typing your search above and press return to search.
సుశాంత్ ఫ్యామిలీ నాపై ఒత్తిడి చేస్తోంది : సుశాంత్ ఫ్రెండ్
By: Tupaki Desk | 31 July 2020 10:50 AM GMTబాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో రోజుకొక విషయం బయటకి వస్తోంది. ఇప్పటి వరకు సుశాంత్ ని ఆత్మహత్య చేసుకునేలా ఎవరో ప్రేరేపించారని.. ప్లాన్ చేసి హత్య చేసారని.. ఈ కేసుపై ముంబై పోలీసుల తీరు అనుమానం కలిగిస్తోందని.. అందుకే ఈ సుశాంత్ కేసుని సీబీఐ దర్యాప్తుపై ఇవ్వాలని డిమాండ్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో సుశాంత్ మరణంలో రియా చక్రవర్తి పాత్రపై దర్యాప్తు చేయాల్సిందిగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రియాతో పాటు ఫ్యామిలీ మెంబెర్స్ పైనా కేసు నమోదు చేసిన బీహార్ పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేసారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు బాలీవుడ్ లోని పలు ప్రొడక్షన్ హౌసెస్ పై ఆరోపణలు చేయమని ఒత్తిడి చేస్తున్నట్లు సుశాంత్ లాయర్ వెల్లడించారు. ఇప్పుడు సుశాంత్ ఫ్యామిలీ ఈ కేసులో నాపై ఒత్తిడి తెస్తోందంటూ సుశాంత్ ఫ్రెండ్ ఆరోపిస్తున్నాడు.
కాగా రియా చక్రవర్తికి వ్యతిరేకంగా తప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వాలని సుశాంత్ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారని అతడి స్నేహితుడు క్రియేటివ్ కంటెంట్ మేనేజర్ సిద్ధార్థ్ పిథాని ఆరోపించాడు. ఈ విషయంపై బాంద్రా పోలీసులకు మెయిల్ చేసిన పిథాని.. 'జూలై 22న సుశాంత్ సోదరి మితు సింగ్ ఆమె భర్త మరియు ఐపీఎస్ అధికారి ఓపీ సింగ్ కలిసి తనకు కాన్ఫరెన్స్ కాల్ చేసారని.. రియా ముంబైలోని మౌంట్ బ్లాక్ లో సుశాంత్ తో కలిసి ఉంటున్న సమయంలో ఆమె పెట్టిన ఖర్చుల గురించి వివరాలు అడిగారని తెలిపారు. అంతేకాకుండా దీనికి సంబంధించి రియాకు వ్యతిరేకంగా పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని.. నిజానికి రియా విషయాలు నాకు పెద్దగా తెలియదని చెప్పినా వాళ్లు తనని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నట్లు సిద్ధార్థ్ పిథాని ఆరోపించాడు.