Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఫ్యాన్ కు సిద్దార్థ్ పంచ్

By:  Tupaki Desk   |   16 July 2018 8:48 AM GMT
ప్రభాస్ ఫ్యాన్ కు సిద్దార్థ్ పంచ్
X
స్టార్ హీరోల పుట్టిన రోజుని అభిమానులు తమ ఇంటి పండగ లాగా చేసుకోవడం ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే అది ఒక రోజు ముందో లేదా మహా అంటే వారం ముందో ఏర్పాట్లు చేసుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. టెక్నాలజీ పెరిగిపోయింది. సోషల్ మీడియా వచ్చాక హాష్ ట్యాగ్ పేరిట నెల నుంచే రోజుకో డిజైన్ పోస్టర్ తో హంగామా చేయటం మామూలైపోయింది. టెన్ డేస్ టు గో లేదా మరో ముప్పై రోజుల్లో అంటూ ట్విట్టర్ లో ఫేస్ బుక్ లో హోరెత్తించే అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంది. ఇది రాను రాను కాస్త కొత్త దారి తీసుకుని ఏకంగా వందల రోజుల్లో రానున్న బర్త్ డే లకు సైతం ఇప్పటి నుంచే విష్ చేసే పోకడ మొదలైంది. హీరో సిద్దార్థ్ ఇది చిరాకు తెప్పించింది. ప్రముఖ సినిమా ఇండస్ట్రీ ట్రాకర్ గా పేరున్న రమేష్ బాలా అక్టోబర్ 23న రానున్న ప్రభాస్ బర్త్ డే కు సూచికగా 100 డేస్ టు కింగ్ ప్రభాస్ బర్త్ డే కౌంట్ డౌన్ బిగిన్స్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

దీనికి స్పందించిన హీరో సిద్దార్థ్ ఇది జరిగిన తర్వాత 465 రోజుల్లో ప్రభాస్ నెక్స్ట్ బర్త్ డే వస్తుందని కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతుందని చురక వేసాడు. ఇలాంటి హాష్ టాగ్స్ థ్రిల్ ఇవ్వాలి తప్ప మరీ వంద రెండు వందల రోజుల ముందు నుంచే పుట్టిన రోజుల హంగామా చేస్తే అది చచ్చిపోతుందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి హాష్ ట్యాగ్ లను కాస్త విచక్షణతో వాడమని హితవు పలికాడు. ఇందులో నిజం లేకపోలేదు. హీరో పుట్టిన రోజును ఇలా వందల రోజుల ముందే హంగామా చేస్తే అసలు రోజు నాడు అది చల్లారిపోయే ప్రమాదం ఉంది. ఏడాదిలో ఉన్నదే 365 రోజులు. అలాంటిది ఒక్క పుట్టిన రోజు కోసం మిగిలిన రోజుల కౌంట్ డౌన్ చేసుకుంటూ కూర్చోవడం ఏంటి అనేదే సిద్ధార్థ్ ట్వీట్ లోని ఉద్దేశం. ఇది అర్థమైన కొందరు సిద్దార్థ్ కు మద్దతు పలకగా మరికొందరు మాత్రం నిజంగానే సిద్దార్థ్ కూడా కౌంట్ డౌన్ చెబుతున్నాడు అనుకుని బెస్ట్ విషెస్ చెప్పడం కొసమెరుపు.