Begin typing your search above and press return to search.

సిద్దు ఎకౌంట్ హ్యాక్ అయ్యింది

By:  Tupaki Desk   |   9 Dec 2017 9:42 AM GMT
సిద్దు ఎకౌంట్ హ్యాక్ అయ్యింది
X
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను తారలు ఏ స్థాయిలో వాడేస్తున్నారో అందరికి తెలిసిందే. ప్రేక్షకులకు దగ్గరవ్వాలని అలాగే వారి ఇమేజ్ ను కూడా పెంచుకోవాలని స్టార్స్ సోషల్ మీడియాలోకి వస్తున్నారు. అయితే ఒక్కోసారి వారికి తెలియాకుండా వారి ఎకౌంట్స్ హ్యాక్ అవుతుంటాయి. సెలబ్రెటీలకు ఇలాంటీ సమస్యలు ఎదురవుతుండడం కామన్. అయితే హ్యాకర్ల చేతిలో పడితే సెలబ్రెటీల ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

అయితే రీసెంట్ గా సిద్దార్థ్ ట్విట్టర్ ఎకౌంట్ కూడా హ్యాక్ అయ్యింది. ఆరు నిమిషాల పాటు తన ట్విట్టర్ ని ఎవరో హ్యాక్ చేశారని అలాగే తన ట్విట్టర్ ద్వారా కొన్ని వివాదస్పద ట్వీట్స్ కూడా చేశారని చెప్పాడు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారాన్ని అందించానని సిద్దార్థ్ తెలిపాడు. ఇంతకుమును అమితాబ్ బచ్చన్ వంటీ వారి ట్విట్టర్ కూడా ఇదే తరహాలో హ్యాక్ అయ్యింది. మరికొంతమంది తారలు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి ఆ తర్వాత వివరణ ఇచ్చారు.

సిద్దార్థ్ గృహం సినిమాతో చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హారర్ తరహాలో వచ్చిన ఆ సినిమా మూడు భాషల్లో రిలీజ్ అయ్యి సిద్ధుకు మంచి విజయాన్ని అందించింది. సిద్దార్థ్ ప్రస్తుతం తమిళ్ లో అలాగే మలయాళంలో ఒక సినిమాను చేస్తున్నాడు. అలాగే తెలుగులో కూడా మరొక మంచి సినిమాను చేసి మళ్లీ తన గత వైబావాన్ని చూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.