Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: సిద్ధార్థ్

By:  Tupaki Desk   |   22 Aug 2016 1:51 PM GMT
టీజర్ టాక్: సిద్ధార్థ్
X
ఫ్యాక్షన్ నేపథ్యం వున్న సినిమాలు చాలానే వచ్చాయి. అవన్నీ దాదాపు విజయమే సాధించాయి. తాజాగా సాగర్ అనే యువకుడు కూడా ఓ ఫ్యాక్షన్ నేపథ్యం సినిమాలో కనిపించబోతున్నాడు. ‘సిద్ధార్థ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్సె విడుదలైంది. ప్టెంబరు 2న ఆడియోను ఆవిష్కరించి... అదే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ చూస్తుంటే... ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందినట్టు అర్థమవుతోంది. ‘అన్నీ వదిలేద్దాం అనుకున్నా.. ఙ్ఞాపకాల్ని.. గాయాల్నీ మరిచిపోదాం అనకున్నా. కానీ గతం నీడలా వెంటాడుతూనే వుంది’ అంటూ.. వాయిస్ ఓవర్ వస్తూ.. ఫారిన్ లో ఓ భారీ ఛేజింగ్ అండ్ యాక్షన్ షూట్స్ తెరకెక్కించారు. ఓ నల్ల జాతీయుడు గన్ ఎక్కు పెట్టడం.. అతన్నుంచి తప్పించుకోవడం లాంటి సీన్స్ అన్నీ.. చూస్తుంటే.. ఇదేదో రివేంజ్ స్టోరీలా కనిపిస్తోంది. గతానికి దూరంగా విదేశాల్లో జీవిస్తుండే హీరోకు హీరోయిన్ పరిచయం కావడం.. హీరోను‘ఇంతకూ మీ పేరు చెప్పలేదు’ అని హీరోయిన్ రాగిణి నంద్వానీ అడగటం.. ఆ వెంటనే సూర్య అని అజయ్ అరవడం లాంటివన్నీ వింటుంటే ఇందులో మాస్ ను మెప్పించే యాక్షన్ సీన్స్ బాగానే వున్నట్టున్నాయి.

రామదూత క్రియేషన్స్ పై దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ మాటలు రాస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి పనిచేస్తున్నారంటే.. ఈ సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి నిర్మాత ప్లాన్ చేశారో అర్థం అవుతోంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు కె.వి.దయానంద్ రెడ్డి దర్శకత్వం వహించారు.