Begin typing your search above and press return to search.
కాపీ క్యాట్ అన్నా పట్టించుకోని టిల్లు బాబు!
By: Tupaki Desk | 11 Feb 2022 11:30 PM GMTయంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న `డీజే టిల్లు` శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకి మంచి బజ్ ని తీసుకొచ్చాయి. రొమాన్స్.. డబుల్ మీనింగ్ డైలాగులు..పెదవి ముద్దుల తో `డీజే టిల్లు` యూత్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. కంటెంట్ యూత్ ని టార్గెట్ చేస్తే సిద్దు మాత్రం విజయ్ దేవరకొండని కాపీ కొట్టినట్లు ట్రోల్ అవుతున్నాడు. కొన్ని సన్నివేశాల్లో సిద్దు విజయ్ ని అనుకరించి నటించినట్లు..డైలాగులు అదే తరహాలో చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. దీంతో ట్రోలర్స్ ఎటాక్ చేసారు. కాపీ క్యాట్ అనే ముద్రని సిద్దు మీద వేసారు.
ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇవే ప్రశ్నలు సిద్దు ముందుకు వెళ్లాయి. దానికి సిద్దు చాలా కూల్ గా బధులిచ్చాడు. `ఇలాంటి ప్రశ్నలు అడిగినందుకు నాకు ఎలాంటి కోపం రాలేదు. నన్ను ట్రోల్ చేసిన వారపై కూడా ఎలాంటి కోపం లేదు. విమర్శల్నే ప్రశంసలకు మార్చుకుంటున్నా. సినిమా సక్సెస్ అవ్వడం మాకు ముఖ్యం. ఎవరో ఏదో అన్నారని వాటిని పట్టుకుని లాగడం ఇష్టం లేదు . అలాగే సినిమా ప్రారంభ రోజు నుంచి రిలీజ్ వరకూ సక్సెస్ కోసమే పనిచేసాం. సక్సెస్ పై అంతే నమ్మకంతో ఉన్నాం. అయితే ఈ సినిమాకి ఇంతగా ప్రచారం రావడానికి కారణం అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించడమే అస్సెట్ గా మారింది.
అటుపై సిద్దు నటన..ఇతర అంశాలు సినిమాకి కలిసొచ్చాయి. సినిమా టైటిల్ క్యాచీగా ఉండటంతో యువతలోకి దూసుకుపోయింది. కంటెంట్ పరంగాను పాజిటివ్ బజ్ ఉంది. సినిమా ఫలితం ఎలా ఉంటుందన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇక సిద్దు జొన్నల గడ్డ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమై హీరోగా ప్రమోట్ అయ్యాడు. `లైఫ్ భీఫోర్ వెడ్డింగ్` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అటుపై `జగమేమాయ`..`గుంటూరు టాకీస్`..`కృష్ణా అండ్ హిజ్ లీలా`.. `మా వింతగాధ వినుమ` లాంటి చిత్రాల్లో నటించాడు. కానీ ఇవేవి సిద్దుకి పెద్దగా సక్సెస్ ని తెచ్చి పెట్టలేదు. దీంతో ఆశలన్ని `డీజే టిల్లు`పైనే ఉన్నాయి. ఇక ఈ యంగ్ హీరో మంచి ట్యాలెటెడ్ కూడా. రచయితగా..సింగర్ గానూ తన ప్రతిభను ఛాన్స్ వచ్చినప్పుడల్లా చాటుకుంటున్నాడు.