Begin typing your search above and press return to search.
పదే పదే వెంటాడి పెళ్లెప్పుడు అంటుంటే..!
By: Tupaki Desk | 19 Jan 2023 3:54 AM GMTబాలీవుడ్ లవ్ బ ర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ పెళ్లి చేసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈలోగానే ఈ జంటపై అధికారికంగా భార్యాభర్తలుగా ముద్ర పడిపోయింది. తాజా సమాచారం మేరకు సిద్ధార్థ్ - కియారా ఫిబ్రవరి 6 న ఇరువైపులా వారి సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
పెళ్లి గురించి ఈ జంట అభిమానులు మీడియా నుంచి సూటిగా ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. దీనిపై దాపరికం లేకుండా ఆ ఇద్దరూ ఓపెన్ గానే ఉన్నారు. మంగళవారం రాత్రి జరిగిన 'మిషన్ మజ్ను' స్క్రీనింగ్ లో ఈ జంట ఎంతో సన్నిహితంగా మరోసారి కెమెరా కళ్లకు పట్టుబడ్డారు. అయితే జంట నుండి పెళ్లి తేదీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఫోటోగ్రాఫర్లు చాలా తంటాలు పడ్డారు.
సిద్ధార్థ్-కియారా వెడ్డింగ్ సందడిగా సాగేందుకు అవకాశం ఉంది. కరోనా భయాలేవీ లేవు కాబట్టి ఇది సరైన ముహూర్తం. హల్దీ - సంగీత్ మొదలు ముంబై రిసెప్షన్ గెస్ట్ లిస్ట్ వరకు ప్రతిదీ ఇప్పటికే రెడీ అయిపోయాయని వారి షాపింగులు పూర్తయ్యాయని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఈ జంట శుభలేఖ అచ్చయిందా లేదా? అన్నదానికి సరైన సమాచారం లేదు.
సిద్ధార్థ్ తన సినిమా 'మిషన్ మజ్ను' షో కోసం వచ్చినప్పుడు ఒక చిన్న హింట్ ఇచ్చాడు. "ఫిబ్రవరి 6న కలుద్దాం" అంటూ ఛాయాచిత్రకారులతో తమాషా చేసాడు. అతడు తన చిరునవ్వును ఆపుకోలేకపోయాడు. కానీ అమాయకంగా ముఖం పెడుతూనే పెళ్లి తేదీ గురించి తెలియదు అన్నట్టే నటించాడు. ఫోటోగ్రాఫర్లు దీనిపై ప్రశ్నించేంత లోపే అతడు చకచకా షో లోపలికి వెళ్ళాడు.
మరోవైపు అదే ప్రశ్నను కియారాను ప్రశ్నించగా.. ఫోటోగ్రాఫర్లకు సింపుల గా వీడ్కోలు పలికింది. స్క్రీనింగ్ కు వెళ్లే ముందు ఛాయాగ్రాహకులకు పోజులిచ్చేటప్పుడు బాగా సిగ్గుపడకుండా దాచుకోలేకపోయిందని .. నవ వధువులా సిగ్గుల మొగ్గ అయిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.