Begin typing your search above and press return to search.

2023 ఏప్రిల్ లో పెళ్లి.. ఓపెనైన కియ‌రా ప్రియుడు

By:  Tupaki Desk   |   13 Oct 2022 1:29 PM GMT
2023 ఏప్రిల్ లో పెళ్లి.. ఓపెనైన కియ‌రా ప్రియుడు
X
సిద్ధార్థ్ -కియారా అద్వానీ పెళ్లి వార్తలు నెట్ లో దావాన‌లంలా మారాయి. అభిమానుల్లో ప్ర‌స్తుతం ట్రెండింగ్ టాపిక్ ఇది. సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ బాలీవుడ్ లోని అత్యంత అంద‌మైన‌ జంటగా పాపుల‌ర‌య్యారు. గ‌త మూడు సంవత్సరాలుగా వారి డేటింగ్ గురించి పుకార్లు షికార్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జోడీ పెళ్లి గురించిన రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

తాజా క‌థ‌నాల ప్రకారం.. ఈ జంట 2023 ఏప్రిల్ లో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారంటూ ప్ర‌చారం సాగుతోంది. కొంద‌రు సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరగనుందని సమాచారం. తాజా పుకార్ల న‌డుమ యువ‌హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తాజా వ్యాఖ్య హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట పెళ్లి ఢిల్లీలో కుటుంబసభ్యులు బంధువుల సమక్షంలో జరగనుందని తెలుస్తోంది. ఏప్రిల్ 2023లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారని పుకార్లు కూడా ఉన్నాయి. వివాహం తర్వాత దిల్లీ- ముంబైలో విడివిడిగా గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఆ ఇద్దరూ రిసెప్షన్ తర్వాత కాక్టెయిల్ పార్టీలో స‌న్నిహితులంద‌రితో సంద‌డి చేస్తారు.

సిద్ - కియారా త‌మ‌ సంబంధంపై ఎప్పుడూ మౌనం పాటించారు. ఇప్పుడు కూడా పెళ్లి పుకార్లకు సంబంధించి ఎటువంటి అధికారిక‌ ధృవీకరణను చేయ‌లేదు. ప్రేమికులు కానీ లేదా వారి ప్రతినిధులు కానీ దీనిపై ఇంకా ప్రస్తావించలేదు. కానీ తమ అభిమాన జోడి పెళ్లి గురించి ఫ్యాన్స్ ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. ఈ అంద‌మైన జంట‌ పెళ్లి చేసుకుని నిజ జీవిత జోడీగా మారాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల కియారా `కాఫీ విత్ కరణ్` షోలో కనిపించింది . సిద్ధార్థ్ తో తాను అత్యంత స‌న్నిహితంగా ఉంటాన‌ని స్నేహితుడు మాత్ర‌మేన‌ని చెప్పింది. కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అని కూడా హింట్ ఇచ్చేసింది. కానీ క‌ర‌ణ్ - షాహిద్ ఏడాది చివ‌రి నాటికి శుభ‌వార్త చెబుతారంటూ అస‌లు గుట్టు బ‌య‌ట‌పెట్టేసారు. ఇంత‌లోనే ఇప్పుడు ఏప్రిల్ 2023 లో ఈ జంట పెళ్లి జ‌ర‌గ‌నుందంటూ ప్ర‌చారం సాగుతోంది. ఓ ఇంట‌ర్వ్యూలో పెళ్లి గురించి దాచ‌లేం క‌దా! అంటూ సిద్ధూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు దుమారంగా మారింది.

``నేను నా చుట్టూ అందమైన వివాహాలను చూశాను.. నా జీవితంలో కూడా అలా జరుగుతుందని నేను వేచి చూస్తున్నాను. అయితే అది ఎప్పుడు జరుగుతుందో నేను వెల్లడించను అని కియ‌రా ఇంత‌కుముందు అంది. ఇప్పుడు పెళ్లికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. తాను కోరుకున్న ప్రియుడితోనే నిఖా ఖ‌రారైంద‌ని గుస‌గుస‌లు హీటెక్కిస్తున్నాయి. అయితే ఇరువ‌ర్గాల నుంచి అధికారికంగా దీనిపై ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డాల్సి ఉంటుంది. తాజా పుకార్ల న‌డుమ అంద‌మైన‌ ప్రేమ పక్షులకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైర‌ల్ గా మారుతున్నాయి.