Begin typing your search above and press return to search.
ఇండియన్ పోలీస్ ఫోర్స్ పేరుతో ఏందీ హడావుడి?
By: Tupaki Desk | 20 April 2022 11:30 PM GMTచూస్తుంటే కాప్ సిరీస్ ల పేరుతో మరో `కెప్టెన్ అమెరికా`నే తీసేట్టున్నాడు రోహిత్ శెట్టి. కాప్ యూనివర్శ్ అంటూ బోలెడంత హంగామా క్రియేట్ చేస్తున్నాడు బాలీవుడ్ లో. సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా భారీ యాక్షన్-ప్యాక్డ్ సిరీస్ ని అతడు తెరకెక్కించనున్నాడు. ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనేది టైటిల్. ఇది ఓటీటీలోనే అతి భారీ కాప్ సిరీస్ అంటూ ఊదరగొట్టేస్తున్నారు. ఇండియన్ పోలీస్ ఫోర్స్ సిరీస్ కోసం రోహిత్ శెట్టి పిక్చర్ తో కలిసి ప్రైమ్ వీడియో భారీ బడ్జెట్లను అందించనుంది.
ప్రైమ్ వీడియో ఈరోజు రోహిత్ శెట్టి పిక్చర్స్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇండియన్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ను ప్రకటించింది. ఇండియన్ పోలీస్ ఫోర్స్ పేరుతో రోహిత్ శెట్టి మేకింగ్ నుండి ప్రేక్షకులు ఆశించే ప్రతి అంశం ఈ సిరీస్ లో ఉంటుందని హామీ ఇస్తున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్ తో భారీ బ్లాక్ బస్టర్ లకు దర్శకత్వం వహించడంలో రోహిత్ శెట్టి ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతడు యువనటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. భారతదేశంలో స్ట్రీమింగ్ సిరీస్ ల విషయంలో సరికొత్త బెంచ్ మార్క్ ను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది అమెజాన్.
ప్రజల్ని సురక్షితంగా ఉంచడానికి తమ కర్తవ్య నిర్వహణ కోసం పోలీసులు ఎలాంటి సాహసాలు చేస్తారో ఎలాంటి త్యాగాలు చేస్తారో ఈ సిరీస్ లో చూపించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మన పోలీసు అధికారుల నిస్వార్థ సేవ.. షరతులు లేని నిబద్ధత .. తీవ్రమైన దేశభక్తికి ఈ కల్పిత సిరీస్ ద్వారా సగర్వంగా తెరపైకి తెస్తున్నామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్షన్ సినిమాల ప్రేక్షకుల కోసం భారతదేశం నుండి ఉద్భవిస్తున్న యాక్షన్ కంటెంట్ ఇది. వెబ్ సిరీస్ ల పరంగా స్థాయిలో మరో లెవల్ చూపించాలని `ఇండియన్ పోలీస్ ఫోర్స్` లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు- భూభాగాల్లోని వీక్షకులు భారతదేశం నుండి వస్తున్న నేటివిటీ విలువలతో కూడిన కాప్ యూనివర్స్ స్టోరీ ఇదని రోహిత్ శెట్టి టీమ్ చెబుతోంది.
అపర్ణ పురోహిత్ (ఇండియా ఒరిజినల్స్- అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా హెడ్) మాట్లాడుతూ- ``మన పోలీసు బలగాల నిస్వార్థ సేవ మరియు అచంచలమైన నిబద్ధతకు సెల్యూట్ చేసే కథనంతో రోహిత్ శెట్టి తన మొట్టమొదటి డిజిటల్ వెంచర్ కోసం రెడీ అవుతున్నందుకు వారికి సహకరించడానికి మేం సంతోషంగా రెడీ అయ్యాం. మేము బడ్జెట్ల విషయంలో ఖచ్చితంగా ఉన్నాము. ఈ సిరీస్ రోహిత్ సంవత్సరాల తరబడి రూపొందించిన యాక్షన్-ప్యాక్డ్ కాప్ సినిమాలకు మరింత తీవ్ర రూపం. ఈ యాక్షన్ కోలాహలం సృష్టించే మా ప్రయాణాన్ని మేము ప్రారంభించినప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రాను అమెజాన్ ప్రైమ్ వీడియో కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షకులకు ఇండియన్ పోలీస్ ఫోర్స్ సంతోషకరమైన అనుభవాన్ని అందిస్తుంది!`` అని తెలిపారు.
దర్శక-నిర్మాత రోహిత్ శెట్టి మాట్లాడుతూ- "ఇండియన్ పోలీస్ ఫోర్స్ నాకు చాలా ప్రత్యేకమైనది. నేను దాని కోసం చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నాను. భౌగోళిక పరంగా భాషాపరమైన అడ్డంకులను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అదే విధంగా ప్రదర్శించే అవకాశాన్ని అందించే ఈ కథనానికి జీవం పోయడానికి అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి పని చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ సిరీస్ లో అద్భుత ప్రతిభావంతులైన సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి పని చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీ. నేను ఎల్లప్పుడూ యాక్షన్-ఫస్ట్ ఎంటర్ టైన్ మెంట్ రేంజును పెంచడానికి కృషి చేస్తున్నాను. ఈ సిరీస్ తో మేము కొత్త బెంచ్ మార్క్ ను సృష్టిస్తామని నేను విశ్వసిస్తున్నాను`` అని తెలిపాడు.
రోహిత్ శెట్టి ప్రయత్నం చూస్తుంటే మరో కెప్టెన్ అమెరికా- కెప్టెన్ మార్వల్ తరహాలో ఏదైనా ప్రయోగం చేస్తున్నాడా? అన్నది వేచి చూడాలి. ఇటీవల సినిమాల ట్రెండ్ మారిపోయింది. యూనివర్శల్ కాన్సెప్టులతో సౌత్ సినిమా దూసుకొస్తోంది. అందుకే ఇప్పుడు రోహిత్ శెట్టి ఏం చేసినా ఆ కాన్సెప్ట్ మాత్రం సౌత్ లోనూ కనెక్టవ్వాల్సిన సన్నివేశం ఉంది. లేదంటే అతడి ప్రయత్నం వృధా అయినట్టే. అలా కాకూడదనే కోరుకుందాం.