Begin typing your search above and press return to search.

ఆ రీమేక్ ని బడా బ్యాన‌ర్ ప‌క్క‌న‌బెట్టేస్తుందా?

By:  Tupaki Desk   |   21 Aug 2022 2:30 PM GMT
ఆ రీమేక్ ని బడా బ్యాన‌ర్  ప‌క్క‌న‌బెట్టేస్తుందా?
X
మాలీవుడ్ సంచ‌ల‌నం `క‌ప్పెలా`ని తెలుగులో సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. సుకుమార్ అసిస్టెంట్ శౌరీ చంద్ర శేఖ‌ర్ ఈ రీమేక్ ని టేక‌ప్ చేసారు. మాతృక‌లో శ్రీకాంత్ భాసీ పోషించిన పాత్ర‌కి తెలుగులో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని ఎంపిక చేసారు. `విశ్వాసం` ఫేం బాలన‌టి అనైక‌ను హీరోయిన్ గా తీసుకున్నారు.

కొన్నాళ్ల క్రిత‌మే సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. అయితే అప్ప‌టికి సిద్దు `డీజే టిల్లు` షూటింగ్ లో బిజీ గా ఉండ‌టంతో? అత‌నిపై స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌లేదు. దీంతో ముందుగా సినిమాలో ఇత‌ర న‌టీనటుల‌పై షూటింగ్ పూర్తిచేసే ప్ర‌క్రియ‌ని ప్రారంభించింది. ఈ క్ర‌మంలో కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్త‌యింది.

ఇటు సిద్దు కూడా ఖాళీ అవ్వ‌డంతో అత‌నిపై కూడా షూట్ ప్రారంభింద్దాం అనుకుంటోన్న స‌మ‌యంలో సిద్దు అడ్డం తిరిగిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. `డిజే టిల్లు` విజ‌యంతో సిద్దు క్రేజీ హీరోగా మారిపోవ‌డంతో ఇప్పుడా పాత్ర‌ని చేయ‌న‌ని అన్నాడ‌ట‌. సినిమాలో పాత్ర నెగిటివ్ ఉండ‌టం త‌న ఇమేజ్ కి డ్యామేజ్ ని తెచ్చిపెడుతుంద‌ని భావించి చేయ‌న‌ని క‌రాఖండీగా చెప్పేసాడుట‌.

సితార బ్యాన‌ర్ రిక్వెస్ట్ చేసినా నో ఛాన్స్ అనేసాడుట‌. దీంతో అదే పాత్ర‌కి త్రివిక్ర‌మ్ కోడైరెక్ట‌ర్ త‌న‌యుడ్ని అనుకుంటున్నారు. అయితే సినిమాలో అంతా కొత్త వాళ్లైతే మార్కెట్ ప‌రంగా ఇబ్బంది ఏర్ప‌డుతుంద‌ని భావిస్తున్నారుట‌. కొత్త వాళ్ల‌తో ముందుకెళ్ల‌డం క‌న్నా? ప్రాజెక్ట్ ని పూర్తిగా ప‌క్క‌న‌బెట్టేయ‌డ‌మే మంచిద‌ని మ‌రో ఆలోచ‌న‌గానూ అనుకుంటున్నారుట‌.

మ‌రి సిద్దు రిజెక్ష‌న్ విష‌యంలో క్లారిటీ లేదు. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌కి నేడు అంత క్రేజ్ ద‌క్కిందంటే కార‌ణం సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్. ఆ బ్యాన‌ర్లోనే యంగ్ హీరో డీజేటిల్లు నిర్మాణం అయింది. ఆ సంస్థ కాబ‌ట్టే తెలుగు రాష్ర్టాల్లో సినిమా పెద్ద ఎత్తున రిలీజ్ అయింది. అప్ప‌టివ‌ర‌కూ సిద్దు కొన్ని సినిమాల్లో న‌టించినా అత‌నెవ‌రో పెద్ద‌గా తెలియ‌దు.

తొలిసారి ఇమేజ్ ఏర్ప‌డిందంటే దాని వెనుక ప్ర‌ధాన కార‌ణం సితార సంస్థ‌. అలాంటి సితార సంస్థ నిర్మిస్తున్న సినిమా ఆఫ‌ర్ ని సిద్దు నిజంగా కాదు! అన్నాడు అంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. న‌టులంతా ఇప్పుడున్న ఇమేజ్ చ‌ట్రం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సినిమాలు చేస్తున్నారు. పాత్ర‌లో పాజిటివ్ ..నెగిటివ్ అనే కొణాన్ని చూడ‌టం లేదు. పాత్ర ఫరిది...యాక్టింగ్ స్పోప్ ఉందా? లేదా? అన్న‌ది చూస్తున్నారు.