Begin typing your search above and press return to search.
టిల్లు భయ్యా! ముందుంది ముసళ్ల పండగ!!
By: Tupaki Desk | 13 Feb 2022 6:30 AM GMTబిడ్డొచ్చే వేళ.. కలిసొచ్చే వేళ..! హిట్టొచ్చే వేళ.. ఛాన్సులు పెరిగే వేళ! ఎవరూ ఎవరినీ ఆపలేరు!! ఇప్పుడు డీజే టిల్లు అలియాస్ సిద్ధూ భయ్యాను ఎవరైనా ఆపగలరా? ఏమో తెలీదు కానీ..! అతడు హిట్టొచ్చిన వేళ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దూసుకుపోకపోతే మళ్లీ కాంపిటీషన్ లో వెనకబడడం ఖాయం.
సిద్ధు జొన్నలగడ్డ డిజె టిల్లు పాత్రతో సోలోగా షోని నడిపించాడని ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే అతడు ఈ ప్రశంసల జల్లులో తడిసి ముద్దయి అన్నీ మర్చిపోతే కష్టం. అతడు టిల్లుగా తన సినిమాకు ఏకైక ఆకర్షణగా నిలిచాడు సరే... తన కామెడీ డైలాగ్ డెలివరీతో మెప్పించాడు సరే.. అయితే ఇది సరిపోతుందా ఇక ముందు? అట్లుంటది సరే.. ఇకపై ఎట్లుంటది!? అన్నదే ఇంపార్టెంట్.
ఒక్క హిట్టు ఏ హీరోకి అయినా మాంచి ఊపు తెస్తుంది.. కానీ కెరీర్ ని గ్యారెంటీగా పొడిగించదు. టాలీవుడ్ లో ఏ సినిమాకి ఆ సినిమానే అని ఒక పెద్ద హీరో చెప్పినట్టుగా ప్రతి సినిమాతో హిట్టు కొట్టాలి. మధ్యలో ఒకటీ అరా పోయినా పరిశ్రమ క్షమించి అవకాశాలిస్తుంది కానీ ఎక్కడా నెగ్లజెన్సీ అనేది క్షమార్హం కానిది.
సిద్ధు లాంటి ప్రతిభావంతులు ఇంకా చాలా మంది తెలుగు సినీపరిశ్రమలో దాగి ఉన్నారు. వారంతా బయటికి వస్తే అప్పుడు కాంపిటీషన్ కూడా ఆ లెవల్లోనే పెరుగుతుంది. నిఖిల్.. కార్తికేయ.. అడివి శేష్ .. వీళ్లంతా ఇప్పటికే తనలానే వచ్చి నిరూపించుకున్నారు. కెరీర్ పరంగా పూర్తి బిజీగా ఉన్నారు. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డకు టైమ్ వచ్చింది.
డీజే టిల్లు అతడికి రియల్ బ్రేకింగ్ పాయింట్ .. ఒకవేళ సద్వినియోగం చేసుకుంటే ఇదే సదవకాశం. ఇదే రైట్ టైమ్. పూనకం వచ్చిన వాడిలా కాకుండా సాలోచనతో అతడు ఎదగాలని మనస్ఫూర్తిగా అభిమానులు కోరుకుంటున్నారు. గుంటూరు టాకీస్ లో అతడు చూపించిన టింజును ఎవరూ ఇంకా మర్చిపోలేదు. యూత్ ని మెప్పించే ఏదో మాయ అతడిలో ఉందని డీజే టిల్లు పాత్రతో నిరూపణ అయ్యింది. దీనిని ఇప్పుడు అతడు తెలివిగా ఎన్ క్యాష్ చేస్కోవాలి.
వాస్తవ కోణం పరిశీలిస్తే.. DJ టిల్లు సిద్ధు కి మొదటి బిగ్ రిలీజ్.. తొలి బిగ్ బ్రేక్ కూడా ఇదే. అతడు నటించిన మునుపటి రెండు చిత్రాలు కృష్ణ అండ్ హిజ్ లీల - మా వింత గాధ వినుమ రెండూ OTTలో విడుదలయ్యాయి. ఆ సినిమాలకు సిద్ధు మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు డీజే టిల్లుతో సిద్ధూ మరోసారి ఎనర్జిటిగ్గా తనదైన విధానంలో దూసుకొచ్చాడు.
థియేట్రికల్ రిలీజ్ ఇప్పుడు అతడికి పెద్ద బూస్ట్ ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అతనికి మంచి రైటింగ్ స్కిల్స్ కూడా ఉండడం వల్ల అడివి శేష్ తరహాలోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఏ సినిమాకైనా మంచి అసెట్ గా నిలుస్తాడు.
అయితే ఇక్కడి నుంచి అతని కెరీర్ ను ఎలా తీర్చిదిద్దుకుంటాడు? అన్నది అసలైన పాయింట్. పోటీలో యూనిక్ స్టైల్ తో దూసుకుపోతూ ఉండాలి. గ్యాప్ లేకుండా రాణించాలి. నువ్వా నేనా? అంటూ ఇతరులతో పోటీలో వార్ నడిపించాలి. గతంలో ఎందరో యంగ్ హీరోలు మంచి క్రేజ్ అందుకున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేక చతికిలబడ్డారు. పోటీలో నిష్కృమించారు కానీ నిలబెట్టుకోలేకపోయారు.
కానీ సిద్ధూ ఇప్పుడు ఆ తప్పు చేయకూడదని విశ్లేషిస్తున్నారు. సిద్ధూ తన కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటాడు? ఏదో ఒకటి సంతకం చేసేస్తాడా.. అలా కాకుండా యూనిక్ గా వెళతాడా? అన్నది వేచి చూడాలి. నాని- నిఖిల్ లా స్వయంకృషితో ఎదిగేందుకు ఇక్కడ ఆస్కారం ఉంది. మరి ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేస్తాడు? అన్నది వేచి చూడాలి.