Begin typing your search above and press return to search.

సైమా 2020 అవార్డులో హైలెట్.. అదరగొట్టేసిన ‘అల వైకుంఠ పురం’

By:  Tupaki Desk   |   20 Sep 2021 4:36 AM GMT
సైమా 2020 అవార్డులో హైలెట్.. అదరగొట్టేసిన ‘అల వైకుంఠ పురం’
X
రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు సినిమాలకు ఇవ్వాల్సిన పురస్కారాల్ని పక్కన పెట్టేయటం తెలిసిందే. నంది లేదు పంది లేదంటూ ప్రభుత్వ పెద్దలు ఎక్కెసం ఆడేసినా.. మనసులోని మాటను బయటపెట్టేంత దమ్ము లేని పరిస్థితుల్లో ఇండస్ట్రీ నెలకొని ఉంది. దీనికి తోడు కరోనా మహమ్మారితో గతంలో ఎప్పుడూ ఎదుర్కొని చాలా విచిత్రమైన పరిస్థితుల్నితెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటోంది.

ఇలాంటివేళ.. సైమా అవార్డుల ఫంక్షన్ ను నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో సైమా అవార్డులు 2019 ప్రకటించగా..తాజాగా ఈ రోజున సైమా అవార్డులు 2020ను ప్రకటించారు. ఇందులో అల వైకుంఠపురం మూవీకి పెద్ద ఎత్తున అవార్డులు సొంతమయ్యాయి. హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం జరుగుతున్న అవార్డుల ప్రధానోత్సవంలో 2020 విజేతల జాబితాను విడుదల చేశారు.

మొత్తం అవార్డుల్లో అల వైకంఠపురములో మూవీకి ఏకంగా పన్నెండు అవార్డులు లభించటం విశేషం. ఉత్తమ చిత్రం.. ఉత్తమ దర్శకుడు.. ఉత్తమ నటుడు.. ఉత్తమ నటుడు క్రిటిక్స్.. ఉత్తమ నటి.. ఉత్తమ నటి క్రిటిక్స్.. ఉత్తమ సహాయ నటుడు.. ఉత్తమ సహాయ నటి.. ఉత్తమ సంగీత దర్శకుడు.. ఉత్తమ గేయ రచయిత.. ఉత్తమ గాయకుడు.. ఉత్తమ విలన్.. ఇలా మొత్తం డజను అవార్డుల్ని సొంతం చేసుకోవటం చాలా అరుదైన అంశంగా చెప్పక తప్పదు.

సైమా 2020లో తెలుగు అవార్డులు ఎవరికంటే..

ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో
ఉత్తమ దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): సుధీర్‌బాబు (వి)
ఉత్తమ నటి: పూజా హెగ్డే (అల వైకుంఠపురములో)
ఉత్తమ నటి (క్రిటిక్స్): ఐశ్వర్య రాజేష్ (వరల్డ్ ఫేమస్ లవర్)
ఉత్తమ సహాయ నటుడు: మురళీ శర్మ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సహాయ నటి: టబు (అల వైకుంఠపురములో)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎస్.ఎస్. థమన్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ గేయ రచయిత: రామజోగయ్య శాస్త్రి(బుట్టబొమ్మ.. అల వైకుంఠపురములో)
ఉత్తమ గాయకుడు: అర్మాన్ మాలిక్(బుట్టబొమ్మ.. అల వైకుంఠపురములో)
ఉత్తమ గాయని: మధుప్రియ (హిజ్ ఈజ్ సో క్యూట్-సరిలేరు నీకెవ్వరు)
ఉత్తమ విలన్: సముద్రఖని (అల వైకుంఠపురములో)
ఉత్తమ తొలి పరిచయ హీరో: శివ కందుకూరి (చూసి చూడంగానే..)
ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: రూప కొడువయూర్ (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య)
ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: కరుణ కుమార్ (పలాస 1978)
ఉత్త తొలి పరిచయ నిర్మాత: అమృత ప్రొడక్షన్స్ అండ్ లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ (కలర్‌ఫొటో)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: ఆర్. రత్నవేలు (సరిలేరు నీకెవ్వరు)
ఉత్తమ కమెడియన్: వెన్నెల కిషోర్ (భీష్మ)