Begin typing your search above and press return to search.

పోటీలో బాలయ్య, బన్నీ, నాని మరో ముగ్గురు..!

By:  Tupaki Desk   |   21 Aug 2022 2:30 AM GMT
పోటీలో బాలయ్య, బన్నీ, నాని మరో ముగ్గురు..!
X
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా SIIMA) 2022 నామినేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఇండియన్ సినీ ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ అవార్డు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఉత్తమ నటుడి కేటగిరిలో ఆరుగురు హీరోలు పోటీ పడుతున్నారు.

పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పాత్ర ను పోషించిన అల్లు అర్జున్‌ నామినేషన్ దక్కించుకున్నాడు. అఖండ సినిమా లో అద్భుతమైన నటన కనబర్చిన బాలయ్య కూడా ఈ నామినేషన్స్ లో చోటు దక్కించుకున్నారు. ఇక జాతిరత్నాలు సినిమాలో నటించిన నవీన్ పొలిశెట్టి కి కూడా నామినేషన్‌ దక్కించుకున్నాడు. నాంది సినిమాలో హీరోగా నటించిన అల్లరి నరేష్‌ కూడా సైమా నామినేషన్స్ లో నిలిచాడు.

లవ్ స్టోరీ సినిమాలో నటించిన నాగ చైతన్య మరియు శ్యామ్‌ సింగ రాయ్ సినిమాలో నటించిన నాని లు కూడా ఉత్తమ హీరో కేటగిరీలో నామినేషన్ ను దక్కించుకున్నాడు.

హీరోల్లో ఈ ఆరుగురికి కూడా మంచి ఓటింగ్ దక్కే అవకాశం ఉంది. నటన విషయంలో నువ్వా నేనా అన్నట్లుగా ఈ ఆరుగురు పోటీ పడే అవకాశం ఉంది.

ఈ ఆరుగురిలో ఎవరికి అవార్డు వస్తుంది అనేది ఆసక్తిగా మారింది. హీరోల్లో అల్లు అర్జున్‌ మరియు బాలయ్య లకు మంచి ఓటింగ్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు. వీరు కాకుండా బరిలో నాని మరియు అల్లరి నరేష్ లు కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి టాలీవుడ్ హీరోల్లో ఈ ఏడాది మేటి హీరోగా నిలిచేది ఎవరు అనేది చూడాలి.