Begin typing your search above and press return to search.

'మాస్ట్రో' పై మౌనమెందుకో..?

By:  Tupaki Desk   |   10 Aug 2021 1:30 AM GMT
మాస్ట్రో పై మౌనమెందుకో..?
X
'చెక్' 'రంగ్ దే' వంటి చిత్రాలను ఈ ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన యూత్ స్టార్ నితిన్.. ''మాస్ట్రో'' చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ మీద ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ 'అంధాదున్' కు తెలుగు రీమేక్. సమ్మర్ లో థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేశారు.

ఈ నేపథ్యంలో 'మాస్ట్రో' సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డిజిటల్ విడుదల అవుతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ + హాట్ స్టార్ కు దాదాపు రూ.35 కోట్లకు ఈ చిత్రాన్ని అమ్మేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్ అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు 'మాస్ట్రో' మేకర్స్ దీనిపై స్పందించలేదు. డిజిటల్ రిలీజ్ అని అధికారికంగా అనౌన్స్ చేయలేదు.. అలాగని ఈ వార్తలను ఖండించలేదు.

గత కొన్ని రోజులుగా 'మాస్ట్రో' చిత్ర బృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఒక్కొక్కటిగా సాంగ్స్ ను విడుదల చేస్తూ.. సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని ప్రకటిస్తున్నారు కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది?, ఏ ఫ్లాట్ ఫార్మ్ పై విడుదల చేస్తారనేది? క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ ఓటీటీలో విడుదల చేసేది నిజమే అయితే ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

పెద్ద సినిమాలు కూడా ఈ మధ్య ఓటీటీ రిలీజ్ అవుతుండటం పట్ల తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సైతం ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి నిర్ణయాలపై డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్లు థియేటర్ యాజమాన్యాలు కూడా సుముఖంగా లేరు. అందుకే 'మాస్ట్రో' సినిమా విడుదల ప్రకటన లేట్ అవుతుందేమో అనే సందేహాలు సినీ అభిమానుల్లో ఉన్నాయి. మరోవైపు థియేటర్లు తెరుచుకోవడంతో కొత్త సినిమాలు రిలీజ్ డేట్స్ ని ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు నితిన్ సినిమా ఎప్పుడొస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

కాగా, 'మాస్ట్రో' చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్నా భాటియా కీలక పాత్రలో నటిస్తోంది. న‌రేష్‌ - జిషుసేన్ గుప్తా - శ్రీ‌ముఖి - అన‌న్య‌ - హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ - ర‌చ్చ ర‌వి - మంగ్లీ - శ్రీ‌నివాస్ రెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. యువ‌రాజ్.జె ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. ఎస్.ఆర్ శేఖర్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.