Begin typing your search above and press return to search.
ఏఏ19 సైలెంటుగా మొదలెట్టారు!
By: Tupaki Desk | 13 April 2019 9:41 AM GMTఅల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో తారా స్థాయిలో అంచనాలుంటాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి బ్లాక్ బస్టర్లు అందుకున్న కాంబినేషన్ ఇది. అందుకే ఈ జోడీ తిరిగి కలిసి పని చేస్తున్నారు అనగానే ఒకటే ఆసక్తి నెలకొంది. గత ఆర్నెళ్లుగా ఆ ఇద్దరి కలయికలో హ్యాట్రిక్ సినిమా గురించి స్టైలిష్ స్టార్ అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. స్క్రిప్ట్ లాక్ చేసేందుకే బన్ని ఏడాది కాలం వేచి చూశారంటే ఈ సినిమాకోసం మాటల మాంత్రికుడిపై ఎంత ఒత్తిడి నెలకొందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ - అరవింద్ డ్యూయోని స్క్రిప్టు పరంగా ఒప్పించేందుకు త్రివిక్రముడు చాలానే కసరత్తు చేయాల్సి వచ్చిందని అర్థమవుతోంది. ఎట్టకేలకు పకడ్భందీగా స్క్రిప్టును రెడీ చేసుకుని .. నేడు సైలెంటుగా ముహూర్తం చేసేశారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ఏఏ19 సింపుల్ గా ప్రారంభమైంది.
13 - 4 - 19 తేదీ 10.50 కి ఠెంకాయ కొట్టి ముహూర్తం చేశారు. ఈ కార్యక్రమానికి మీడియాకు ఆహ్వానం లేదు. మీడియా హంగామా లేకుండానే చిత్రయూనిట్ ముహూర్త కార్యక్రమం పూర్తి చేశారు. ఈ నెల 24 నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లేందుకు ప్రిపరేషన్స్ సాగిస్తున్నామని దర్శకనిర్మాతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ, కథానాయకుడు అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ సహా ఇతర యూనిట్ పాల్గొన్నారు.
ఈ చిత్రం అల్లు అర్జున్ కి 19వది కాగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న 6వ సినిమా. బడ్జెట్ పరంగా, ప్రొడక్షన్ విలువల పరంగా ఏమాత్రం రాజీకి రాకుండా నిర్మించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. తొలి షెడ్యూల్ ని హైదరాబాద్ లో చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నామని టీమ్ తెలిపింది. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. సీనియర్ కథానాయిక టబు, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవదీప్, బ్రహ్మాజీ,రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆసక్తికరంగా ఈ చిత్రంలో అక్కినేని కాంపౌండ్ హీరో సుశాంత్ ఓ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. పి.ఎస్. వినోద్ ఛాయాగ్రహణం, థమన్ సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ని అందిస్తున్నారు. ఇతరత్రా వివరాలు తెలియాల్సి ఉందింకా.