Begin typing your search above and press return to search.
సిల్క్ స్మిత అరుదైన క్లిక్ వైరల్
By: Tupaki Desk | 26 Oct 2021 5:56 AM GMTవిజయలక్ష్మి అలియాస్ సిల్క్ స్మిత గురించి పరిచయం అక్కర్లేదు. 80ల చివరి నుండి హాట్ అండ్ హ్యాపెనింగ్ డ్యాన్సింగ్ స్టార్. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో సిల్క్ జీవితం కెరీర్ పై డర్టీ పిక్చర్ అనే ఓ సినిమా కూడా తీశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలు సృష్టించి నిర్మాతలకు కాసుల కలశం నింపింది.
ఇప్పుడు సిల్క్ స్మిత కు చెందిన ఓ పాతదైన అరుదైన ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో సిల్క్ స్మితను చూసి ఏజ్ ఎంతో కనిపెట్టే ప్రయత్నం చేస్తోంది యూత్. ఇది చాలా చిన్న వయస్సులో తీసిన ఫోటో. అందులో సిల్క్ చాలా అందంగా ఉంది. ప్రస్తుతానికి ఈ ఫోటో నెట్ లో హల్ చల్ చేస్తోంది. సిల్క్ స్మిత తన జీవితాన్ని విషాదకరమైన రీతిలో ముగించిన సంగతి తెలిసింది. ఆమె అనుమానాస్పద మృతి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తన కెరీర్ ఒడిదుడుకుల్లో మద్యపానం అలవాటుతో సిల్క్ తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుందన్న ఆవేదనా అభిమానుల్లో ఉంది.
200పైగా చిత్రాల్లో సిల్క్ అభినివేశనం
దాదాపు 200పైగా తెలుగు- తమిళ- మళయాళ- కన్నడ చిత్రాలలో నటించిన సిల్క్ స్మిత.. అనేక సినిమాలలో ప్రత్యేక గీతాల్లో నర్తించింది. శృంగార రస నృత్యాలతో రంజింపజేయడం లో సిల్కుని కొట్టేవాళ్లే లేరన్న గుర్తింపు దక్కింది. హాటెస్ట్ బోల్డెస్ట్ స్టార్ గా అవతరించిన సిల్క్ స్మిత కథతో బాలీవుడ్ నిర్మాతలు కాసులు కొల్లగొట్టారు. అయితే సౌత్ లో మాత్రం సిల్క్ జీవితకథను సినిమాగా తీసే ప్రయత్నం చేయకపోవడం చర్చనీయాంశమైంది.
సిల్క్ స్మిత అలియాస్ విజయలక్ష్మి 1960 డిసెంబరు 2 న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పింది. సినీనటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది. స్మిత అని తెరపేరు ధరించింది. సిల్క్ స్మిత మొదటి చిత్రము తమిళంలో వండి చక్రం (బండి చక్రం). 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్ బహుభాషల్లో ప్రజాదరణ పోందడంతో ఆమె తన పేరును సిల్క్ స్మిత గా మార్చుకుంది.
క్రమంగా సిల్క్ సినీరంగలో ప్రముఖనటిగా నిలదొక్కుకుంది. 200పైగా తెలుగు- తమిళ- మళయాళ- కన్నడ చిత్రాలలో నటించింది. అనేక సినిమాలలో ఆమె ప్రత్యేక గీతాలు- శృంగార నృత్యాలు అమెకు అత్యంత జనాదరణను తెచ్చి పెట్టాయి. తెలుగులో ``బావలు సయ్యా.. మరదలు సయ్యా`` పాట ఎంతగా పాపులరైందో తెలిసిందే. కొందరు సినిమా విలేఖరులు, విమర్శకులు ఆమెను సాఫ్ట్ నీలిచిత్రాల నటిగా అభివర్ణించారు. ఎక్కువ చిత్రాలలో ఆమె ఇతరులను వలలో వేసుకొనే అమ్మాయిగా నర్తకిగా నటించింది. ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోను కామోద్దీపనము కలిగించే దుస్తులతోను బోల్డ్ గాళ్ గా కనిపించింది. అయితే సీతాకోక చిలుక (1981) వంటి కొన్ని చిత్రాలలో నటనాప్రధానమైన పాత్రతోనూ మెప్పించింది. అలాగే వసంత కోకిల" చిత్రంలో ఆమె పాత్ర విమర్శకుల మన్ననలు పొందింది.
సిల్క్ స్మిత తన జీవితాంతం అవివాహిత గానే ఉంది. 1996 సెప్టెంబరు 23 న మద్రాసులోని తన నివాస గృహంలో మరణించి ఉంది. అంతకు ముందు ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమయ్యాయని.. చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్దపెట్టున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను నిసృహలోకి నెట్టివేసిఉండవచ్చునని అందువల్లనే ఆమె ఆత్మహత్య చేసుకొన్నదని కథనాలొచ్చాయి.