Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: అరగంటలో కైలాసం
By: Tupaki Desk | 23 Aug 2018 8:18 AM GMTచాలా కాలం తర్వాత అల్లరి చేసేందుకు కాంబోగా వస్తున్న అల్లరి నరేష్ సునీల్ ల కొత్త సినిమా సిల్లీ ఫెలోస్ మోషన్ పోస్టర్ ఇందాకా విడుదల చేసారు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న విడుదల అనుకుంటున్నారు కానీ ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక పోస్టర్ విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద అల్లరి నరేష్ వేగంగా దూసుకుపోతూ ఉండగా వెనుకగా సీట్ కొనలను పట్టుకున్న సునీల్ ఆపమని బతుమాలుతున్నట్టుగా ఉంది. గంటలో శ్రీశైలం వెళ్ళిపోతాం కదాని అల్లరి నరేష్ అంటే దానికి బదులుగా ఇలా అయితే అరగంటలో కైలాసం కూడా వెళ్లొచ్చు అని చెప్పడం పేలింది. మొత్తానికి అవుట్ అండ్ అవుట్ కామెడీ జానర్ లోనే దీన్ని రూపొందించినట్టు కనిపిస్తోంది. భీమినేని లాస్ట్ హిట్ సుడిగాడు తీసింది అల్లరి నరేష్ తోనే. ఆ తర్వాతే ఇద్దరికీ హిట్లు లేకుండా పోయాయి.
ఇక సునీల్ పెద్ద గ్యాప్ తర్వాత ఇతర హీరోతో స్క్రీన్ చేసుకుని కనిపిస్తున్నాడు. అల్లరి నరేష్ సునీల్ గతంలో కలిసి సినిమాలు చేసారు. అందులో ఈవివి గారి దర్శకత్వంలో వచ్చిన తొట్టి గ్యాంగ్ మంచి పేరు తీసుకొచ్చింది. మళ్ళి ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయటం బాగానే ఆసక్తి రేపుతోంది. చిత్ర శుక్లా-పూర్ణ-నందిని రాయ్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ మూవీకి శ్రీవసంత్ సంగీతం అందిస్తున్నాడు. పెద్ద కామెడీ గ్యాంగ్ నే పెట్టుకుని భీమినేని ఈ సినిమా తీసినట్టు కాస్టింగ్ ని బట్టే అర్థమవుతోంది. చిన్న సినిమాల మధ్య భారీ పోటీ ఉన్న సెప్టెంబర్ 7న సిల్లీ ఫెలోస్ ని తీసుకొస్తారా లేదా అనే సస్పెన్స్ మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఇద్దరు హీరోలకు దర్శకుడికి చాలా అత్యవసరంగా హిట్ కావాల్సిన నేపధ్యంలో వస్తున్న సిల్లీ ఫెలోస్ మీద హాస్య ప్రియులు ఓ మోస్తరు అంచనాలతోనే ఉన్నారు.