Begin typing your search above and press return to search.

సిల్లీఫెలోస్.. అసలు కథ అదీ

By:  Tupaki Desk   |   3 Sep 2018 2:30 PM GMT
సిల్లీఫెలోస్.. అసలు కథ అదీ
X
తెలుగులో రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ భీమనేని శ్రీనివాసరావు. ఇప్పటిదాకా భీమనేని 20 దాకా సినిమాలు చేస్తే అందులో ఒకటో రెండో మాత్రమే స్ట్రెయిట్ మూవీస్. మిగతావన్నీ రీమేకులే. మొదట్లో రీమేక్ లతో వరుసగా హిట్లు కొట్టడంతో తర్వాత కూడా వాటికే పరిమితం అయిపోయాడు. రీమేక్ లు బాగా డీల్ చేస్తాడన్న గుర్తింపుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనూ ఒకటికి రెండు సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్నాడు భీమనేని. ఐతే క్రమంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారిపోయి రీమేక్‌ ల పట్ల మొహం మొత్తేయడంతో భీమనేని సైడైపోయాడు. చాలా గ్యాప్ తర్వాత ‘తమిళ్ పడం’ ఆధారంగా అల్లరి నరేష్ తో ‘సుడిగాడు’ తీసి హిట్టు కొట్టాడు కానీ.. ఆ తర్వాత మరో రీమేక్ మూవీ ‘స్పీడున్నోడు’ మాత్రం చీదేసింది. దీంతో భీమనేని కెరీర్లో మళ్లీ గ్యాప్ వచ్చేసింది.

మళ్లీ ఇప్పుడు భీమనేని ‘సిల్లీ ఫెలోస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది రీమేకా.. స్ట్రెయిట్ మూవీనా అన్న సమాచారమే ఇప్పటిదాకా బయటపెట్టలేదు. ప్రమోషన్లలో కూడా భీమనేని ఆ విషయం చెప్పట్లేదు. కానీ ఇది కూడా రీమేకే అని సమాచారం. తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘వేలయను వందుట్టా వేలైక్కారన్’ చిత్రం దీనికి ఆధారం. తమిళంలో ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. లౌడ్ కామెడీతో సాగే సినిమా ఇది. ఐతే తమిళంలో విష్ణు ఒక్కడే హీరో. అతడి సహాయకుడిగా పరోటా సూరి నటించాడు. సినిమాకు అతడి కామెడీనే హైలైట్ గా నిలిచింది. మరి తెలుగులో చూస్తే అల్లరి నరేష్ తో పాటు సునీల్ కూడా హీరోగా నటించాడు. మరి సూరి పోషించిన సహాయ పాత్రనే సునీల్ చేశాడేమో చూడాలి. బహుశా తెలుగులో అతడి పాత్రను పెంచి ఉండొచ్చు. సునీల్ కామెడీ ఇమేజ్ దెబ్బ తిన్న నేపథ్యంలో సూరిలా కామెడీ పండించగలడా అన్నది డౌటు. ఆ పాత్ర పండకపోతే మాత్రం కష్టమే అవుతుంది. ‘సిల్లీ ఫెలోస్’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానున్నసంగతి తెలిసిందే.