Begin typing your search above and press return to search.

సిల్లీ రూమర్‌.. నాగార్జున పోస్ట్‌ కు ఎసరు పెట్టిన సామ్‌

By:  Tupaki Desk   |   3 Jun 2022 5:30 AM GMT
సిల్లీ రూమర్‌.. నాగార్జున పోస్ట్‌ కు ఎసరు పెట్టిన సామ్‌
X
నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత అక్కినేని ఫ్యామిలీ పై సమంత కక్ష సాధించినట్లుగా వ్యవహరిస్తుంది... అందులో భాగంగానే నాగార్జున హోస్టింగ్‌ చేస్తున్న బిగ్‌ బాస్ ను తన వశం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది అంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నాగార్జున కంటే చాలా తక్కువ పారితోషికంకు బిగ్‌ బాస్‌ సీజన్ 6 కు గాను సమంత హోస్టింగ్‌ చేసేందుకు ముందుకు వచ్చిందని... దాంతో షో నిర్వాహకులు ఆమెకు అవకాశం ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది.

గతంలో బిగ్ బాస్ లో సమంత సందడి చేసింది. హోస్టింగ్‌ చేసి మెప్పించింది. నాగార్జున సూచన మేరకు.. ఆయన లేని సమయంలో సమంత హోస్టింగ్‌ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె ఫుల్‌ టైమ్‌ తెలుగు బిగ్‌ బాస్ కు హోస్ట్‌ గా మారబోతుంది అంటూ పలు వెబ్‌ మీడియాలో కూడా కథనాలు రాస్తున్నాయి. కాని అవన్నీ కూడా సిల్లీ రూమర్స్. అందులో ఒక్క శాతం కూడా నిజం లేదని స్టార్‌ మా వారు క్లారిటీ ఇచ్చారు.

బిగ్‌ బాస్‌ సీజన్ 6 కు సంబంధించిన హడావుడి మొదలు అయ్యింది.. ఇప్పటికే నాగార్జున హోస్టింగ్‌ చేయబోతున్నట్లుగా ప్రోమో విడుదల చేసి మరీ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు సమంత రాబోతుంది... సమంత కక్ష సాధింపు అంటూ ప్రచారం చేయడం.. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేయడం చాలా సిల్లీగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చైతూ నుండి విడిపోయినా కూడా సమంత కు అక్కినేని ఫ్యామిలీ తో సంబంధాలు మాత్రం మరీ దారుణంగా చెడి పోయి ఉండవు. ఇప్పటికి స్నేహ పూర్వకంగానే వారు సందర్బానుసారంగా కలుస్తూ ఉంటారు. అందువల్ల సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సమంత బిగ్‌ బాస్ అనేది నూరు శాతం అబద్దం అనేది క్లారిటీ.

సమంత ప్రస్తుతం తెలుగు లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఆగస్టు లో యశోద సినిమా తో రాబోతుంది.. ఆ తర్వాత శాకుంతలం సినిమా కూడా రాబోతుంది. మరో వైపు బాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడి ఎంట్రీ ఉండబోతుంది. హిందీ లో మరో వెబ్‌ సిరీస్ ను కూడా సమంత చేయబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అంతే తప్ప తెలుగు బిగ్‌ బాస్ కు ఆమె హోస్టింగ్ అనేది ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా చేయదు.