Begin typing your search above and press return to search.

మహేష్ అంత సిల్లీగా ఆలోచిస్తాడా ?

By:  Tupaki Desk   |   31 May 2019 1:30 AM GMT
మహేష్ అంత సిల్లీగా ఆలోచిస్తాడా ?
X
రేపు మహేష్ బాబు-అనిల్ రావిపూడి సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. రెగ్యులర్ షూటింగ్ కు ఇంకా టైం ఉన్నా ముహూర్తం బాగున్న నేపథ్యంలో రేపు ఫిక్స్ చేశారు. అందులోనూ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో ఇలా కలిసి వచ్చింది. వచ్చే సంక్రాంతి టార్గెట్ కాబట్టి ఖచ్చితంగా ఆరు నెలల్లో పాటలతో సహా మొత్తం పూర్తి చేయాల్సిన బాధ్యత అనిల్ మీదుంది.

ఇదిలా ఉండగా మహేష్ 27కి సంబంధించిన పుకార్లు ఇంకా షికారు చేస్తూనే ఉన్నాయి. పరశురామ్ ఓ లైన్ చెప్పాడని అయితే సుకుమార్ ఇష్యూ లో అల్లు అర్జున్ ఇన్వాల్వ్ కావడం నచ్చని మహేష్ ఆ కారణంగానే గీత ఆర్ట్స్ లో కాకుండా వేరే బ్యానర్ లో ఈ సినిమా చేద్దామని చెప్పాడని ఏదేదో ప్రచారం జరిగిపోతోంది. ఇది నిజంగానే సిల్లీ రూమర్ గా చెప్పుకోవచ్చు

ఇంకా అనిల్ రావిపూడి ఫుల్ నెరేషనే మహేష్ ఇప్పుడు వినబోతున్నాడు. అలాంటిది దాని తర్వాత ప్రారంభమయ్యే సినిమాకు నిర్మాత గురించి ఇప్పుడే అంత బుర్రబద్దలు కొట్టుకునే పని ఎందుకు చేస్తాడు. నిజంగా పరశురామ్ కథ చెప్పాడో లేదో తెలియదు. నచ్చకపోతే మొహమాటం లేకుండా సీనియర్ డైరెక్టర్లకే నో చెప్పే మహేష్ కేవలం సింగల్ లైన్ విని ఫ్లాట్ అయిపోయేంత సీన్ ఇప్పుడు లేదు .

కథల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండబోతున్నానో మహర్షి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పదే పదే చెప్పాడు. కాబట్టి పరశురాం గురించి అంత హడావిడి పడే సీన్ ఉండదు. కొసమెరుపు ఏమిటంటే అసలు పరశురాం నిజంగా మహేష్ కు కథ చెప్పాడా లేదా అనేది డౌటేనని ఫిలిం నగర్ టాక్. నిజానిజాలు బయటికి రావాలంటే ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.