Begin typing your search above and press return to search.
సింబా దూకుడు మామూలుగా లేదు
By: Tupaki Desk | 8 Jan 2019 11:16 AM GMTతెలుగు సూపర్ హిట్ మూవీ ‘టెంపర్’ ను హిందీలో ‘సింబా’ టైటిల్ తో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ చిత్రం తెలుగులో సాధించిన విజయానికి రెట్టింపు విజయాన్ని హిందీలో ‘సింబా’ దక్కించుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రెండు వందల కోట్ల వసూళ్లకు దగ్గరగా వచ్చింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ చిత్రం 200 కోట్లను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు, ఈ చిత్రానికి పోటీ మరే పెద్ద సినిమాలు లేక పోవడం వల్ల కూడా రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అవ్వబోతున్నాయి.
రణ్ వీర్ సింగ్ హీరోగా సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మొదటి వారం రోజుల్లోనే 150 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుంది. రెండవ వారంలో ఇప్పటి వరకు 40 కోట్లను వసూళ్లు చేసింది. మొత్తంగా నిన్నటి వరకు ఈ చిత్రం 190 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ వారం పూర్తయ్యే వరకు రెండు వందల కోట్ల క్లబ్ లో చేరబోతుంది. ఇక లాంగ్ రన్ లో ఈ చిత్రం 250 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లను దక్కించుకుంటుంది.
ఓవర్సీస్ లో ‘సింబా’ సినిమా వంద కోట్లకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం దాదాపుగా ఓవర్సీస్ లో 73 కోట్లను వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరో రెండు వారాల పాటు ఈ చిత్రంకు పోటీ లేని కారణంగా ఇండియాతో పాటు, ఓవర్సీస్ లో కూడా మ్యాజిక్ మార్క్ ను క్రాస్ చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. మొత్తానికి మన సినిమా హిందీలో ఈ స్థాయిలో దూకుడు ప్రదర్శించడం గర్వించదగ్గ విషయం.