Begin typing your search above and press return to search.
వివాదాల వీరుడి కొత్త కాంట్రవర్శీ
By: Tupaki Desk | 11 Nov 2016 10:20 AM GMTశింబు అనే పేరెత్తగానే అతడి సినిమాల కంటే ముందు అతడి వివాదాలు గుర్తుకొస్తాయి. కెరీర్ ఆరంభం నుంచి తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం అతడికి అలవాటు. నయనతార ప్రేమాయణం-బ్రేకప్ మొదలు.. గత ఏడాది బీప్ సాంగ్ గొడవ వరకు అతడి కెరీర్లో ఎన్నెన్నో వివాదాలున్నాయి. ఇప్పుడు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ లింగుస్వామికి.. శింబుకు మధ్య నడుస్తున్న తీవ్ర స్థాయికి చేరుకుంది. శింబు కొంత్త సినిమా ‘అచ్చం ఎన్బదు మదమాయిడ’ (సాహసం శ్వాసగా సాగిపో తమిళ వెర్షన్) రిలీజవుతున్న వేళ ఈ కాంట్రవర్శీ కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటీ వివాదం అంటే..
గతంలో లింగుస్వామి.. శింబుతో ఒక సినిమా చేయడానికి అతడికి కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చాడు. ఐతే శింబు అనేక వివాదాల్లో చిక్కుకోవడంతో అతడి సినిమాలు విడుదలకే నోచుకోని పరిస్థితి ఎదురవుతుండటంతో లింగుస్వామి వెనక్కి తగ్గాడు. ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ చేస్తున్నట్లు చెప్పి అడ్వాన్స్ వెనక్కి ఇవ్వమన్నాడు. కానీ శింబు ఒప్పుకోలేదు. అడ్వాన్స్ ఇవ్వకుండా తనతో సినిమా చేయాల్సిందే అన్నాడు. చాలా కాలం నుంచి ఇద్దరి మధ్య ఈ వివాదం నడుస్తోంది. శింబు ఎంతకీ దారిలోకి రాకపోవడంతో అతడికి పంచ్ ఇవ్వడానికి సరైన సమయం కోసం ఎదురు చూశాడు లింగుస్వామి. సరిగ్గా ‘అచ్చం ఎన్బదు మదమాయిడ’ రిలీజవుతున్న టైంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను ఆశ్రయించాడు. శింబు మీద ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ సినిమా విడుదల ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఏడాది పాటు వాయిదా పడి లేక లేక విడుదలవుతున్న సినిమాకు అడ్డం పడేసరికి శింబు వెనక్కి తగ్గాడు. లింగుస్వామికి అడ్వాన్స్ తిరిగివ్వడానికి అంగీకరించాడు. దీంతో సినిమా యధావిధిగా విడుదలైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/