Begin typing your search above and press return to search.

హన్సికను వదలని శింబు

By:  Tupaki Desk   |   4 March 2016 3:00 PM IST
హన్సికను వదలని శింబు
X
శిలంబరసన్ అలియాస్ శింబుని కోలీవుడ్లో అందరూ ‘బ్యాడ్ బాయ్’ అంటాడు. తన సినిమాలతో కంటే హీరోయిన్లతో ఎఫైర్లు, అనవసర వివాదాలతో వార్తల్లో ఉంటుంటాడు శింబు. నయనతారతో శింబు ప్రేమాయణం అప్పట్లో సౌత్ ఇండియా అంతటా హాట్ టాపిక్కే. వీళ్ల బ్రేకప్ కూడా అంతే సంచలనం రేపింది. ఐతే అంత జరిగినా మళ్లీ ‘ఇదు నమ్మ ఆళు’ సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించి అందరికీ షాకిచ్చారు. మరోవైపు నయన్ తో బ్రేకప్ తర్వాత కొన్నాళ్లు హన్సికతో ఎఫైర్ నడిపిన శింబు.. ఆమెతో కలిసి ‘వాలు’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లోనే వాళ్లిద్దరూ ప్రేమలో పడటం.. విడిపోవడం అన్నీ జరిగిపోయాయి.

అనేక వివాదాల్ని దాటుకుని ఈ మధ్యే ‘వాలు’ సినిమా రిలీజవడంతో హమ్మయ్య అనుకుని.. శింబుకు టాటా చెప్పేసింది హన్సిక. ఐతే అతను మాత్రం ఆమెను వదిలేలా లేడు. నయత్ తో బ్రేకప్ తర్వాత మళ్లీ సినిమా చేసినట్లే.. హన్సికతోనూ ఓ మూవీ చేయాలని ఆశపడుతున్నాడతను. గత ఏడాది ‘త్రిష ఇల్లాన నయనతార’ లాంటి హిట్టు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆధిక్ రవిచంద్రన్.. తన తర్వాతి సినిమాను శింబుతో చేయాలనుకుంటున్నాడు. ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఐతే ఈ సినిమాలో హన్సికను హీరోయిన్ గా నటింపజేయాలన్నది శింబు, ఆధిక్ ల ఆలోచన. కానీ ఆమె మాత్రం ఒప్పుకోవట్లేదట. ఐతే ఎలాగైనా సరే ఆమెను ఒప్పించి ఈ సినిమాలో నటింపజేస్తే సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. మరి హన్సిక కరుగుతుందో లేదో?