Begin typing your search above and press return to search.
శింబు వెర్సస్ అనిరుధ్.. రచ్చ రచ్చే
By: Tupaki Desk | 14 Dec 2015 11:32 AM GMTతమిళనాట రెండు మూడు వారాలుగా వరదల గురించి తప్ప వేరే వార్తలే లేవు. సినిమాలు, సెలబ్రెటీలకు సంబంధించి కూడా వేరే న్యూస్ ఏమీ లేదు. తారల విరాళాలు.. వారు చేస్తున్న సహాయ కార్యక్రమాల గురించిన వార్తలే దర్శనమిస్తున్నాయి. ఐతే నిన్నట్నుంచి వరదలు-సహాయ కార్యక్రమాల వార్తలు పక్కకెళ్లిపోయాయి. యూట్యూబ్ లో హీరో శింబు - మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పేర్ల మీద వచ్చిన ఓ వీడియో పెద్ద వివాదాన్నే రాజేసింది. అమ్మాయిల చేతిలో మోసపోయిన అబ్బాయిలు.. వాళ్లను తిట్టిపోయడం సరికాదన్న మెసేజ్ తో తయారు చేసిన పాట అది. ఐతే చివరికి ఇచ్చిన సందేశం సంగతి పక్కనబెడితే.. దాని మాటున అమ్మాయిల్ని బూతులు తిట్టేశారు. ఈ లిరిక్స్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మహిళా సంఘాలు మండిపడ్డాయి. సాయంత్రం శింబు - అనిరుధ్ లపై పోలీస్ స్టేషన్లలో కంప్లయింట్లు ఇచ్చేయడం.. కేసులు నమోదు చేయడం కూడా చకచకా జరిగిపోయాయి.
కానీ ట్విస్టు ఏంటంటే.. ఈ పాటతో నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదంటూ శింబు, అనిరుధ్ చేతులు దులిపేసుకుంటుండటం. తన కొడుకు శింబు ఊర్లో లేడని.. అందుకే తాను స్పందిస్తున్నానని టి.రాజేందర్ పెద్ద పత్రికా ప్రకటన ఒకటి ఇచ్చాడు. ఈ పాట అనిరుధ్ కంపోజ్ చేశాడని.. శింబుకి ఏ సంబంధం లేదని.. ఈ పాటను తన కొడుకు ఏ సినిమాలో కూడా వాడలేదని.. కాబట్టి అతడికేమీ సంబంధం లేదని పేర్కొన్నాడు రాజేందర్. ఐతే ఫారిన్లో చెన్నై వరద బాధితుల కోసం ఓ షో చేస్తున్న అనిరుధ్ కూడా ఈ పాట విషయంలో అక్కడి నుంచే ఓ మెసేజ్ ఇచ్చాడు. అతను శింబు పేరేమీ ఎత్తలేదు కానీ.. తనకు ఆ పాటకు ఏ సంబంధం లేదనే చెప్పాడు. తాను ఆ పాట రాయలేదని.. కంపోజ్ చేయలేదని.. పాడలేదని.. తన పేరు దాంతో ముడిపెట్టొద్దని చెప్పాడతను. మరి ఇంతకీ ఆ పాట క్రెడిట్ ఎవ్వరిది? ఈ గొడవంతటికీ కారణం ఎవరన్నదే తెలియడం లేదు.