Begin typing your search above and press return to search.
శత్రువులు.. ఒకరినొకరు పొగిడేసుకున్నారు
By: Tupaki Desk | 7 Dec 2017 6:06 AM GMTకోలీవుడ్లో ఒకప్పుడు రజినీకాంత్-కమల్ హాసన్ అభిమానుల మధ్య విపరీతమైన పోటీ ఉండేది. ఇరు వర్గాల అభిమానుల్లో భేదాభిప్రాయాలు కూడా ఉండేవి. కానీ ఆ ఇద్దరు హీరోల అభిమానులు హద్దులు దాటేవాళ్లు కాదు. కానీ ఈ తరం హీరోల అభిమానుల మధ్య మాత్రం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు శ్రుతి మించాయి. విజయ్-అజిత్ అభిమానుల మధ్య జరిగే సోషల్ మీడియా వార్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీరి తర్వాత ఎక్కువ గొడవలున్నది ధనుష్-శింబు ఫ్యాన్స్ మధ్యే. వీళ్లిద్దరికీ వ్యక్తిగతంగా అంత మంచి సంబంధాలేమీ లేవంటారు. ఐతే వీళ్లిద్దరూ ఓ ఆడియో వేడుకకు కలిసి రావడం.. ఒకరినొకరు తెగ పొగిడేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
హీరోగా.. దర్శకుడిగా.. గాయకుడిగా ఇప్పటికే బహు రూపాలు చూపించిన శింబు.. ఇప్పుడు సంగీత దర్శకుడిగా మారి.. సంతానం కథానాయకుడిగా నటించిన ‘సక్క పోడు రాజా’ అనే చిత్రానికి మ్యూజిక్ ఇవ్వడం విశేషం. ఈ ఆడియో వేడుకకు శింబుతో పాటు ధనుష్ కూడా వచ్చారు. ముందు శింబు మాట్లాడుతూ.. ధనుష్ తన శత్రువు అని అంతా అంటుంటారని.. కానీ అతను తనకు నిజానికి మంచి మిత్రుడని అన్నాడు. తాను అప్పట్లో ధనుష్ హీరోగా నటించిన ‘కాదల్ కొండేన్’ సినిమా చూసి ఫిదా అయిపోయి అతడిని అభినందించానని.. తామిద్దరం భవిష్యత్తులో స్టార్లుగా ఎదుగుతామని అప్పుడే అన్నానని చెప్పాడు. మరోవైపు ధనుష్ మాట్లాడుతూ.. అభిమానులు నెగెటివిటీని తగ్గించుకోవాలని హితవు పలికాడు. శింబు బోర్న్ స్టార్ అని.. అతను 21 ఏళ్లకే దర్శకత్వ బాధ్యతలు నెత్తికెత్తుకుని సినిమా కూడా తీసిన ప్రతిభావంతుడని అన్నాడు. మొత్తానికి శత్రువులుగా భావించే ఇద్దరు హీరోలు ఒకే వేదికపైకి వచ్చి ఒకరినొకరు పొగిడేసుకోవడం కోలీవుడ్ వర్గాల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.