Begin typing your search above and press return to search.
మాజీ బాయ్ ఫ్రెండ్ బాగానే విష్ చేశాడే
By: Tupaki Desk | 10 Aug 2015 1:10 PM ISTఆదివారం(ఆగస్ట్ 9)తో స్టార్ హీరోయిన్ హన్సిక మొత్వానికి 24ఏళ్లు నిండాయి. ఈ చిన్నదానికి హ్యుమానిటీ పాళ్లు కాస్త ఎక్కువ. అందుకే తన పుట్టిన రోజున ముగ్గురు అనాథలను దత్తత తీసుకుంది. ఈ విషయాన్ని హన్సిక మాజీ లవర్ శింబు స్వయంగా చెప్పడం విశేషం.
బర్త్ డే ముందురోజు లేట్ నైట్ వరకూ దుబాయ్ సైమా అవార్డుల ఫంక్షన్ లో సందడి చేసిన ఈ బొద్దుభామ... స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసేందుకు హుటాహుటిన బయల్దేరి వచ్చేసింది. బర్త్ డే సందర్భంగా.. ట్విట్టర్ అకౌంట్ లో చిన్నదానికి కుప్పలుతెప్పలుగా ట్వీట్స్ వచ్చిపడ్డాయి. వీటన్నిటిలో శింబు ట్వీట్సే హైలైట్ గా నిలిచాయి. ఏడాది క్రితంవరకూ చెట్టాపట్టాలేసుకుని చెన్నై అంత తిరిగేసిన ఈ ఇద్దరూ. తర్వాత ఓ అండర్ స్టాండింగ్ కి వచ్చి విడిపోయారు. మిగతావాళ్లతో విడిపోయినప్పుడు ఫీలయ్యాను కానీ... హన్సిక తో బ్రేకప్ మాత్రం అంతా పక్కాగానే జరిగిందని, ఎలాంటి బాధ లేదని గతంలో చెప్పాడు ఈ శిలాంబరసన్. కాని ఈ మధ్యనే హన్సిక తో బ్రేకప్ బాధను కలిగించిందని కూడా చప్పాడు.
అసలు చూస్తుంటే మనోడు హన్సిక మళ్ళీ ఎస్ అంటే వెంటనే ఆమెను పెళ్ళి చేసుకోవడానికి రెడీ అన్నట్లు ఉన్నాడు. కాకపోతే బ్రేకప్ ఎందుకైందో రీజన్ తెలియకుండా మనం మాత్రం తిరిగి ప్యాచప్ గురించి ఏం మాట్టాడతాంలే. ఏదేమైనా శింబు కే చెల్లింది. ఎన్ని ప్రేమలూ, ఎన్ని బ్రేకప్పులూ.. వార్నాయనో!!