Begin typing your search above and press return to search.

నయనతారే కరెక్ట్ అంటున్న తమ్ముడు

By:  Tupaki Desk   |   20 Jun 2016 3:30 PM GMT
నయనతారే కరెక్ట్ అంటున్న తమ్ముడు
X
కోలీవుడ్ హీరో శింబు లవ్ స్టోరీల సంగతి అందరికీ తెలుసు. అసలు ఎవరికీ తెలీకుండా ఏదో చేసేద్దామనే ప్రయత్నం ఈహీరోకు ఉండదు. ఇతగాడి అఫైర్స్ అన్నీ ఓపెన్ తప్పితే సీక్రెట్ మాత్రం కాదు. నయనతారతో శింబు వ్యవహారం కూడా ఇలాంటిదే. మరి ఈ సిట్యుయేషన్ పై శింబు తమ్ముడిని క్వశ్చన్ చేస్తే.. మా అన్నకి జంటగా నయనతారే రైట్ అంటున్న కురళరసన్.

అయితే ఈ తమ్ముడు చెబుతున్న జోడీ సంగతి.. రియల్ లైఫ్ గురించి కాదు. రీల్ లైఫ్ లో శింబుకు సరైన జోడీ నయన్ మాత్రమే అన్నది కురళరసన్ ఉద్దేశ్యం. ఇంతగా ఇతను ఒపీనియన్ ని ఓపెన్ గా మాట్లాడ్డానికి కారణం.. ఈ కుర్రాడు మ్యూజిక్ ఇచ్చిన మూవీ ఇదు నమ్మ ఆళు లో వీళ్లిద్దరే హీరో హీరోయిన్స్. అప్పట్లో వల్లభన్ సినిమా టైం నుంచి శింబు - నయనతారలు మంచి ఫ్రెండ్స్ అన్న కురళరసన్.. తనను కూడా తీసుకుని రెస్టారెంట్స్ కి వెళ్లేవారని అన్నాడు.

ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య వచ్చిన గ్యాప్ రావడంతో.. నయన్ తమ ఇంటికి రావడం మానేసిందన్న కురళరసన్.. ఇప్పుడు తిరిగి మాట్లాడుకుంటున్నట్లు తెలిపాడు. చివర్లో మాత్రం తన అన్నతో ఎంతమంది హీరోయిన్స్ నటించినా.. అతనికి సరైన పెయిర్ నయన్ మాత్రమే అని మరోసారి చెప్పాడు ఈ శింబు తమ్ముడు.