Begin typing your search above and press return to search.

అసలు కలవరనుకున్నారు.. కలిసి నటిస్తున్నారు!

By:  Tupaki Desk   |   27 May 2019 2:15 PM IST
అసలు కలవరనుకున్నారు.. కలిసి నటిస్తున్నారు!
X
తమిళ హీరో శింబు లవ్ స్టొరీలు కోలీవుడ్ లోనే కాదు సౌత్ అంతా ఫేమస్. అయన లవ్ స్టొరీల లిస్టులో ఉన్న ఒక ఘాటు లవ్ స్టొరీ.. హన్సిక తో సాగించినదే. ఒక దశలో ఇద్దరూ పెళ్ళిపీటలు ఎక్కడమే ఆలస్యం అన్నట్టుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే ఏమైందో ఏమో కానీ ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి కనిపించింది లేదు.. కలిసి నటించింది అంతకన్నా లేదు.

తాజాగా ఈ మాజీ ప్రేమజంట ఒక కొత్త సినిమాలో లవర్స్ గా నటిస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. హన్సిక ప్రస్తుతం తన 50 వ సినిమా 'మహా' లో నటిస్తోంది. యూఆర్ జమీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్లు ఇప్పటికే భారీ సంచలనం సృష్టించాయి. ఒకటేమో కాశీలో సన్యాసుల దుస్తులు ధరించి హుక్కా పీలుస్తున్నట్టుగా ఉన్న పోస్టర్.. మరొకటేమో బురఖా ధరించి పిస్టల్ పట్టినట్టుగా ఉన్న పోస్టర్ వివాదాలకు కేంద్ర బిందువులయ్యాయి. ఈ సినిమాలోనే ఒక కీలక పాత్రలో శింబు నటిస్తున్నాడట. ఆ పాత్రకు ప్రాధాన్యం ఉండడంతో హన్సిక స్వయంగా శింబుతో మాట్లాడి ఈ సినిమాలో నటించేలా ఒప్పించిందట. హన్సిక స్వయంగా తనకు ఫోన్ చేయడంతో శింబు కాదనలేకపోయాడట.

రీసెంట్ గా శింబు తన పాత్రకు సంబంధించిన షూటింగ్ లో పాల్గోన్నాడు. దర్శకుడు శింబు- హన్సిక జోడీపై ఒక రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నాడని సమాచారం. ఈ సందర్భంగా కొన్ని ఆన్ లొకేషన్ ఫోటోలను దర్శకుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శింబు ఎంట్రీతో ఈ సినిమాపై ఒక్కసారిగా క్రేజ్ డబల్ అయింది. ఈ సినిమాలో శ్రీకాంత్.. జయప్రకాశ్.. తంబి రామయ్య.. కరుణాకరన్.. ఛాయసింగ్ .. నాజర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.