Begin typing your search above and press return to search.
శింబుకు పెళ్లి చేసేస్తున్నారట
By: Tupaki Desk | 27 Jun 2016 10:31 AM GMTబాలీవుడ్లో సల్మాన్ ఖాన్.. టాలీవుడ్లో ప్రభాస్.. కోలీవుడ్లో శింబు.. వీళ్ల ‘మ్యారేజ్’ ఎఫ్పుడూ హాట్ టాపిక్కే. ఈ ముదురు బ్యాచిలర్ల పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. మన ప్రభాస్ కు లవ్ స్టోరీలంటూ ఏమీ లేవు కానీ.. మిగతా ఇద్దరూ మాత్రం చాలామందితో ప్రేమాయణాలు నడిపారు. ముఖ్యంగా శింబు లవ్ స్టోరీలు ఎప్పుడూ చర్చనీయాంశమే. నయనతార.. హన్సికలతో ప్రేమాయణాలు ఎంత హాట్ టాప్ అయ్యాయో వాళ్లతో బ్రేకప్స్ కూడా అంతే చర్చనీయాంశం అయ్యాయి. వీళ్లిద్దరి తర్వాత ఇంకెవరితోనూ ప్రేమలో పడలేదు శింబు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తాను పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పి ఆసక్తి రేకెత్తించాడు శింబు.
ఇప్పుడు శింబు తండ్రి టి.రాజేందర్..తన కొడుకు పెళ్లి గురించి ఓ ఆసక్తికరమైన కబురు వినిపించారు. శింబు పెళ్లి దాదాపుగా నిశ్చయం అయిపోయిందని.. అతి త్వరలో పెళ్లి జరుగుతుందని ఆయన వెల్లడించాడు. తిరుత్తణి సమీపంలోని ఓ గుడికి వచ్చి పూజలు చేసిన రాజేందర్.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ శింబు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. శింబు లేటెస్ట్ మూవీ ‘ఇదు నమ్మ ఆళు’ విజయానందంలో మొక్కు తీర్చుకోవడానికి వచ్చానని.. అలాగే అతడి పెళ్లి గురించి కూడా ప్రార్థించానని.. త్వరలోనే తన కొడుకును పెళ్లికొడుకుగా చూడబోతున్నానని రాజేందర్ చెప్పాడు. ఇంతకీ శింబుది ప్రేమ వివాహమా.. పెద్దలు కుదర్చిన పెళ్లా అంటే మాత్రం సమాధానం ఇవ్వలేదు. ఏదైనా స్వామివారి దయతోనే జరుగుతుందని సమాధానం దాటవేశాడు రాజేందర్. ఐతే పెళ్లి సంగతి మాత్రం పక్కా అని చెప్పాడు.