Begin typing your search above and press return to search.
#రేర్ గిఫ్ట్.. గారాల కొడుకు శింబుకి మినీ కూపర్ కార్ గిఫ్ట్
By: Tupaki Desk | 1 Dec 2020 5:45 AM GMTశింబు అలియాస్ STR ముఖంలో ఆ సంతోషం దాగడం లేదు మరి. అతని తల్లి ఉషా రాజేందర్ అమూల్యమైన బహుమతికి అభిమానులు థాంక్స్ చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం.. ఉషా తన కొడుకుకు డ్రీమ్ కార్ ని గిఫ్టిచ్చారు.
శింబు ఇటీవల కెరీర్ పరంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్పీడ్ పెంచారు. ఎంతో క్రమశిక్షణతో మేకోవర్ చూపించారు. అతడి హార్డ్ వర్క్ కి గుర్తింపు దక్కుతోంది. మొన్ననే `ఈశ్వరన్` షూటింగ్ ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. సుశీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలోని `మానాడు` చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. పాండిచ్చేరిలో షూటింగ్ సాగుతోంది.
గత కొన్ని నెలలుగా శింబు వ్యక్తిగత వృత్తిపరమైన కంబ్యాక్ కోసం చాలా కష్టపడుతున్నాడు. తన కృషికి బహుమతిగా ఉషా అతనికి మినీ కూపర్ కారు కానుకగా ఇచ్చారట. ఆకుపచ్చ మినీ కూపర్ కొద్ది రోజుల క్రితం వారి ఇంటికి వచ్చింది. సింబు తన తల్లి ఆశ్చర్యకరమైన బహుమతిని ఎంతో ఇష్టపడ్డారట. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా తన కొత్త కారును ప్రయాణానికి తీసుకువెళుతున్నాడు. తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఉషా రాజేందర్ ఆపి ఉంచిన కారు పక్కన నిలబడి కనిపిస్తున్నారు. ఆమె గులాబీల గుత్తిని పట్టుకుని కనిపించారు.
ఇటీవల మానాడు బృందం ఈ చిత్రం నుండి సింబు రూపాన్ని ఆవిష్కరించే రెండు పోస్టర్లను విడుదల చేశారు. మేకర్స్ ప్రకారం అబ్దుల్ ఖాలిక్ అనే ముస్లిమ్ యువకుడి పాత్రను శింబు పోషిస్తున్నారు. సంఘంలో అరాచకులపై ఒంటరిగా పోరాటం సాగించే యువకుడి కథాంశమిదని తెలిసింది.
మనాడులో కల్యాణి ప్రియదర్శన్- ఎస్.జె. సూర్య- మనోజ్ భారతీరాజా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈశ్వరన్ 2021 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది.