Begin typing your search above and press return to search.
90 ఎంఎల్ కు అందుకే సంగీతం ఇచ్చా : శింబు
By: Tupaki Desk | 5 March 2019 1:48 PM GMTఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన '90 ఎంఎల్' చిత్రంపై అక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెల్సిందే. రాజకీయ పార్టీ వారు సినిమాను బ్యాన్ చేయాలంటూ పోలీసు ఫిర్యాదు కూడా నమోదు చేయడం జరిగింది. ఇంతగా విమర్శలు వస్తున్నా కూడా చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం వాటన్నింటిని ధీటుగానే ఎదుర్కొంటున్నారు. దర్శకురాలు అనితా ఉదీప్ సినిమాపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికి గట్టి సమాధానం ఇస్తోంది. ఇక ఇలాంటి బూతు సినిమాకు సంగీతం ఇవ్వడం ఏంటీ అంటూ శింబుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
బ్యాడ్ బాయ్ ఇమేజ్ ఉన్న శింబు ఈ సినిమాకు సంగీతంను ఇవ్వడంతో ఆయన ఇమేజ్ కు న్యాయం చేసినట్లు అయ్యిందని కొందరు విమర్శలు చేస్తున్నారు. స్టార్ హీరో అయిన శింబు ఈ సినిమాకు సంగీతం ఇవ్వడం పట్ల పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో స్వయంగా శింబు తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చాడు. మహిళల ఇతివృత్తంతో తెరకెక్కిన తొలి సినిమా ఇదే కనుక నేను ఈ సినిమాకు పని చేసేందుకు ఆసక్తి చూపించాను.
లేడీ ఓరియంటెడ్ చిత్రంలో మగవారిని కించపర్చకుండా దర్శకురాలు అనితా చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్త్రీల స్వేచ్చ, స్వాతంత్య్రం గురించి మాట్లాడే వారే ఇప్పుడు వాటిపై సినిమా తీస్తే విమర్శలు చేస్తున్నారని శింబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను స్త్రీలకు వ్యతిరేకిని అంటూ చాలా మంది అభిప్రాయం. వారి అభిప్రాయం తప్పు అని నిరూపించేందుకు ఈ సినిమాకు సంగీతాన్ని అందించినట్లుగా శింబు చెప్పుకొచ్చాడు. శింబు సమర్ధించుకునేందుకు ప్రయత్నిస్తున్నా కూడా నెటిజన్స్ మాత్రం ఆయన్ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.