Begin typing your search above and press return to search.
బీప్ సాంగ్ పోస్ట్ చేసిన ఆ నటుడెవరు?
By: Tupaki Desk | 23 Dec 2015 7:36 AM GMTచెన్నై వరదల కష్టాలు పక్కకు వెళ్లిపోయాయి. ఇప్పుడు చెన్నైలో - తమిళనాడులో ఎక్కడ చూసినా ‘బీప్ సాంగ్’ గురించే చర్చ. మహిళల్ని బూతులు తిడుతూ రాసిన ఈ పాట పెను దుమారమే రేపుతోంది. ఈ పాట రాసింది శింబునే అన్నదాంట్లో ఎవరికీ సందేహాల్లేవు. ఐతే తానేదో సరదాగా రాసుకున్నానని.. దాన్ని ఇంకెవరో దొంగతనంగా తీసుకుని నెట్ లో పెట్టేశారని అంటున్నాడు శింబు. ఐతే ఈ పాట ఎలా నెట్ లోకి వచ్చిందన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఐతే ఇందులో ఓ ప్రముఖ నటుడి ప్రమేయం ఉందని కోలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోంది.
శింబు రాసి, పాడిన బీప్ సాంగ్ కు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బాణీలు కట్టినట్లు తెలుస్తోంది. ఐతే ఆ కట్టినవాడు ఊరుకోకుండా తన మిత్రుడైన మరో ప్రముఖ నటుడికి పంపినట్లు తెలుస్తోంది. ఆ నటుడు వాట్సాప్ లో తన ఫ్రెండ్స్ కి పంపాడట. అలా అలా బీప్ సాంగ్ నెట్టింట్లోకి వచ్చేసినట్లు సమాచారం. ఇంతకీ ఆ ప్రముఖ నటుడు ఎవరు అనే విషయంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మరోవైపు ఈ పాట విషయంలో శింబు అరెస్టు ఖాయమని తెలుస్తోంది. శింబు ముందస్తు మెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ న్యాయమూర్తి అందుకు ఒప్పుకోలేదు. బీప్ సాంగ్ నెట్ లోకి రావడంలో తన ప్రమేయం ఏమీ లేదని.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అతను చేసిన విజ్నప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. కాబట్టి ఒకట్రెండు రోజుల్లో శింబు అరెస్టయ్యే అవకాశముంది.